పల్లవి :కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో
మనసుకు కాదు మరువ తరమూ....... (2)
పల్లవి :తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు
రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు
నవ మాసాలు నిండుకున్నప్పుడు
అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు
కత్తిమీద సాము జేసినట్టుగా
కొండంతనొప్పులు అమ్మ తీసుకుంటూ
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి
సచ్చిన శవమోలే సొమ్మల్లునమ్మ
అమ్మంటే ఎంత గొప్పదో
బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా
ఎన్ని జన్మలున్న కవులు కలములు
అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి నీ నామమును దలచి
నిన్ను పూజించినా నీ రుణము తీరునా అమ్మా...
//కమ్మనైన అమ్మపాట//
మనసుకు కాదు మరువ తరమూ....... (2)
పల్లవి :తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు
రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు
నవ మాసాలు నిండుకున్నప్పుడు
అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు
కత్తిమీద సాము జేసినట్టుగా
కొండంతనొప్పులు అమ్మ తీసుకుంటూ
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి
సచ్చిన శవమోలే సొమ్మల్లునమ్మ
అమ్మంటే ఎంత గొప్పదో
బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా
ఎన్ని జన్మలున్న కవులు కలములు
అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి నీ నామమును దలచి
నిన్ను పూజించినా నీ రుణము తీరునా అమ్మా...
//కమ్మనైన అమ్మపాట//
పల్లవి : పచ్చి బాలింతయి వెచ్చాలు మింగుతూ
ఒళ్లు నొప్పులు ఉన్నా ఓర్చుకోని అమ్మ
కక్కి ఏర్గిన పత్తి గుడ్డాల పిండేసి
సాకిరిలో అమ్మొళ్లు సబ్బోలే అరుగును
చిన్న నోట అమ్మ అమ్మాని అంటే
గావురంగా నే మారాముజేత్తే
పావురంగా అమ్మ చెంపను గిల్లీ
ముద్దాడి సంకల ఎత్తుకుంటాది
రత్నమా మెరిసే ముత్యమా
నా బంగారు తండ్రని అంటది
పడుకున్నా లేదా కూర్చున్నా
రామ బంటోలే కాపలగుంటది
సందమామను జూపి
గోరుముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడుతది
అమ్మా.......
//కమ్మనైన అమ్మ పాట//
అదుపు తప్పి నే కిందా పడ్డప్పుడు
అది జూసి అమ్మా బిరబిర ఉరికొచ్చి
దెబ్బతాకెనని ఒళ్లంతా జూస్తది
ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నలేకున్నా
మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా
కన్న కడుపే మేడ మిద్దలనుకుంటది
కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది
జ్వరమొచ్చి ఒళ్లుగాలితే
అమ్మ గుండె నిండా బాధ ఉంటది
ఓ దేవుడా నా కడుపునూ
కాపాడమని వేడుకుంటది
కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే
అమ్మ మొఖముల కోటి దీపాలు వెలుగును
అమ్మా........
//కమ్మనైన అమ్మపాట//
పల్లవి : ఆటపాటకు మొదటి ఆది గురవమ్మా
మంచి మాట జెప్పే బంగారు బొమ్మా
ఐదేండ్ల వయసులో పలక చేతికిచ్చి
బడికివో బిడ్డని బ్రతుకు బాటజూపి
ఓనమాలు నేర్చి ఒకటి రెండు సదివి
వయసుతో పాటు సదువు పెరుగుతుంటే
ఎదిగిన కొడుకును కండ్ల జూసుకుంటూ
కడుపు నిండినంత సంబర పడుతది
టీచరో గొప్పడాక్టరో కలెక్టరో కావాలనుకుంటది
మనసున్న తల్లి మన అమ్మ
కమ్మని కలలెన్నో మదినిండ కంటది.
జన్మనిచ్చినతల్లి రాతి బొమ్మ కాదు
జగమంతా జన్మంతా కొలిచేటి దైవమా... అమ్మా.....
కమ్మనైన అమ్మపాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమూ......
సుందర్
No comments:
Post a Comment