అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 3, 2011

కన్న పేగు కదిలిపోయే.. తల్లి మనసు కరిగిపోయే... !

మానవత్వం మరిచిపోయి..
మనిషితనం మాయమాయే..
నెలలు మోసి....
పురుడు పోసి....
పాలబువ్వ... పెట్టినట్టి..
గారాల కొడుకునేడు...
కరుడుగట్టి... ఊగిపోతూ...
కర్కషంగా మాట్లాడే..
అమ్మ అన్న నోటితోటే అనరాని మాటలంటే...
అమ్మే... ఆయమ్మే...
అమ్మా అమ్మా.... అంటూ...
కంటనీరు పెట్టుకొనే..
ఎన్నన్నా ఏమన్నా...
గుండెలోని బాధనంత...
కడుపులోనే దాచుకునే...
కళ్లతోనే బదులిచ్చే...
ఇన్ని తిట్లు తిట్టినా.. కొట్టినా... నెట్టినా...
ఊగుతూ.. తూగుతూ...
దూరంగా వెళ్లిపోతున్న...
కొడుకువైపే ఆ చూపులు..
కంటికి, కనిపించకుండా.....
కన్న బిడ్డ వెడలిపోతే..
కన్న పేగు కదిలిపోయే..
తల్లి మనసు కరిగిపోయే..!
సుందర్

No comments:

Post a Comment