చదువుకోరా నా తండ్రి సక్కని బాలా రాజా నా వంశానికే తేజా పలకా బలపం పట్టూకోని పాఠశాలకుపోరా.. పాఠాలు నేర్చుకోరా గురువు జెప్పిన విధ్యలన్నీ గుర్తు తెచ్చుకోరా నా సక్కనయ్యా రారా... అని నేను సిన్నగున్నప్పుడు ప్రజానాట్యమండలోళ్ళ కళాజాతా వచ్చి మా ఊర్లో పల్లె సుద్దులు జెప్పి నాటకాలు వేస్తే మస్తు జూస్తొళ్లం... మేము గూడా గట్లనే పెద్ద పెద్ద సదువులు సదవాల్నెని... నేనూ ఒక కలెక్టరు.. గావాలే అని గాయల్లనే అనుకున్న...
ఇగ గప్పటినుండి క్లాసుల మంచిగ సదువుతోన్ని.... గిట్ల నా పదో తరగతి కష్టపడి సదివి మంచి మార్కులుదెచ్చుకున్నా... ఇంటర్ కొచ్చేసరికి మాంచి హాస్టల్ల సీటొచ్చింది...ఇంగేముంది రెండు ఏండ్లు కుమ్ముకున్న.... కాలేజీల ఫస్టు వచ్చి...మంచి కాలేజీల జేరాల్నని బయిటికెల్లిన....
ఇగ గప్పటినుండి క్లాసుల మంచిగ సదువుతోన్ని.... గిట్ల నా పదో తరగతి కష్టపడి సదివి మంచి మార్కులుదెచ్చుకున్నా... ఇంటర్ కొచ్చేసరికి మాంచి హాస్టల్ల సీటొచ్చింది...ఇంగేముంది రెండు ఏండ్లు కుమ్ముకున్న.... కాలేజీల ఫస్టు వచ్చి...మంచి కాలేజీల జేరాల్నని బయిటికెల్లిన....
గప్పటిదాకా నేను హాస్టల్లో ఉండెటోన్ని ఇగ బయటికి ఎళ్లిన తర్వాత అర్థం అయ్యింది పపంచం తంతు.. గప్పటిదాకా హాస్టల్లో ఇరుకు గదుల్లో ఉంటూ గదే పపంచం... పుస్తకాలే లోకం గానీ గెప్పుడైతే హాస్టల్ మాతల్లిని ఇడిసిపెట్టిననో కస్టాలు అంటే గెట్లుంటయో సమ్మజయితనే ఉంది... సదువుల తల్లి సరస్వతి సంతలో సరుకులా అమ్ముడుబోతుంటే అప్పటి వరకూ కన్న తల్లి లెక్క సూసుకునే సదువుల తల్లీ గప్పటినుండి సవతి తల్లి సందం అయ్యింది. ప్రతి చిన్న దానికి పైస గావాలే పైసామే పరమాత్మ అని ఎందుకంటరో గిప్పుదు సమ్మజయ్యితుంది. ఇగ సదువుకునుడు మానేసి సదువుకొనుడు షురువు జేసిన... గప్పటినుంచి సదువుల్లో సారం అర్థంగాకున్నా జేబు సారం మాత్రం అంతా కతం అరుగుతనే ఉంది... గిట్లనో గట్లనో డిగ్రీ పూర్తిజేసి పీజికొచ్చిన ఇగ గిప్పుడు అసలుకథమొదలైంది. కాలేజీల అడుగుబెట్టిన కాన్నుంచి ఒకటే కర్సు ఇగ ఫార్మల్ డ్రెస్ అంటరు ఏదో, అగ షూసంటరూ... ఏదో మాంచి కార్పోరేట్ కాలేజీ ఫేమస్సని జయినయితే నా దూల దీరేదాకా ఫీజులు గుంజుడు మొదలు బెట్టిర్రు నిన్నగాక మొన్న పరీచ్చ పీజు కట్టనీకెబోతే అన్ని కాలేజీల్ల తక్కువ ఉంటే మా కాలేజీల దానికి డబుల్ రేటు ఏం జెప్పాలన్నా ఈ సదువుల సంతగురించి ఎంత సింతజేస్తే ఏం లాభంజెప్పు... జెప్పినా ఒడువదు... మా దోస్తుగాడు గిప్పుడు బిఈడి జేస్తుండు నిన్నమొన్నటిదాకా 15000 అన్న పీజు ఒక్కసారిగా 60000 కట్టమంటుండ్రు గిదేంది అంటే గది గంతే సదువుతె సదువు లేకపోతే లేదు అంటే గాడు మాత్రం ఏంజేస్తడు మీరే జెప్పుర్రి..
మరి గిట్ల సదువులమ్మ అంగట్లో బొమ్మగా తయారైనప్పుడు సదువుకున్నోళ్లుగా మన కర్తవ్యం ఏంది అని నేను సోంచాయిస్తున్న మరి మీరేంజేస్తరో మీ కొంచెం జెప్పరాదుండ్రి..
సుందర్
No comments:
Post a Comment