కమ్యూనిజం గురించి కావాలంటే... కోడికూయకముందు పనికి పోయి తిండీ తిప్పలు లేకుండా అద్దమ్మ రాతిరి దాకా రెక్కలు ముక్కలు చేసుకుని యంత్రాలలో యంత్రంగా మారి కనీసం కన్న కడుపును చూసుకోలేక చాలీ చాలని వేతనాలతో చావలేక బతకలేక మరో దారి లేక కమ్యూనిజపు దారిలో వెళ్లి పనిగంటలు తగ్గించుకున్న చికాగో కార్మికులనెత్తుటి మరకలను అడుగు కమ్యూనిజం అంటే ఏమిటో...
ఒక వైపు దేశమంతా బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటుంటే..(1948 - 50 సమయంలో) మరో వైపు పటేండ్ల(రెడ్డీల)కు వెట్టి చాకిరి చేస్తూ... అంటరాని తనాన్ని అనుభవిస్తూ... తినడానికి గట్క ( ఒకప్పటి పేదవాడి తిండి) లేక తల్లడిళ్లుతుంటే..... దొరలు ఇండ్లు కట్టేందుకు పిసికిన బురదలో కలిపిన గంజిని పిండుకుని దొంగతనంగా తాగి.... గొర్రెల్లో గొర్రెలుగా బతుకుతున్న నిరక్ష్యరాస్యులలో చైతన్యం కలిగించి... భూమి కోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం సాగిన పోరాటంలో రజాకార్లకు, నైజాము మూకలకు ఎదురొడ్డి పేద వాళ్లకు అండగా నిలిచి గుండుకెదురుగా గుండెను నిలిపి ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన 4000 వేల మంది తెలంగాణా రైతాంగ సాయుదపోరాట అమర వీరుల బలిదానాన్ని అడుగు కమ్యూనిజం అంటే... ఏమిటో..
ఇవి మచ్చుకు రెండు మాత్రమే నీకు టైంపాస్ కాకుంటే ఏ పురాణాలపై చర్చాగోష్టి. పెట్టు బూతు బొమ్మల గురించి నీ ఇష్టమొచ్చినట్లు రాయి చదివి పది కామెంట్లు రాస్తారు. నీవు ఒక పేద వాడి దృష్టితో చూడు నడుస్తున్న కుళ్లు రాజకీయాలను చూసి అదే ప్రపంచం అనుకోకు ఒక సారి పల్లెల్లోకి వెళ్లి చూడు ఎర్రజెండా అంటే గుండెను చీల్చి ఇచ్చేవాళ్లుంటారు. వారిని హర్ట్ చేసేట్లు మాట్లాడకు (రాతలు రాయకు) ... ప్లీజ్..... అన్ని పార్టీలు నాయకులతో నడిస్తే ఎర్రజెండా పేద ప్రజలతో నడుస్తుంది. ఈ సందర్భంగా నీకొక్కటి చెప్తాను కమ్యూనిస్టు పేదవాళ్లతో నడిస్తే అది అధికారంలోకి ఎందుకు రాదు అనే డౌట్ రావచ్చు నిజమే కమ్యూనిస్టులు సాధారణంగా అధికారంలోకి రారు వస్తే దిగే చాన్సే ఉండదు అందుకే భారత దేశంలో ఒక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీ 30సంవత్సరాలుగా దిగ్విజయం సాధిస్తుటే దానిని ఆదర్శంగా తీసుకుని కేరళ, త్రివేండ్రం లాంటి రాష్ట్రాలు కూడా కమ్యూనిస్టుల పాలనలోకి వచ్చాయి . ఇది ఇలాగే సాగుతూ పోతే తమ పప్పులు ఉడకవని ఒక చిన్న రాష్ట్రములో కమ్యూనిస్టులను గద్దె దించేందుకు అమెరికా స్థాయిలో కుట్ర జరుగుతుందంటే కమ్యూనిజం అంటే సామ్రాజ్యవాదుల గుండెల్లో ఎంత దడో అర్థం చేసుకో భూర్జువా మీడియా... సామ్రాజ్యవాద అమెరికా లాంటి దేశాలతో కమ్యూనిజం అనుక్షణం పోరాడుతూ ముందుకు సాగుతూనే ఉంది కమ్యూనిజం ఒక మెట్టు పైకెక్కితే... వాళ్లు ప్రజలను వంద మెట్ల దూరం తోస్తున్నారు. మీడియాలో అశ్లీలత... ప్రేమ... ప్రాంతీయ తత్వం... గొడవలు, కక్షలు ఇలా చూపిస్తూ సామాన్య ప్రజానీకం సమస్యల గురించి, పరిపాలన గురించి ఆలోచించ కుండా చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్‌కు దిశ దశ అయిన యువతను పెడదోవ పట్టించే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయినా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కమ్యూనిజం ముందుకు సాగుతూనే ఉంటుంది . అది ఒక స్టేజ్‌కి వస్తే ఇలాంటి సామ్రాజ్యవాదులు పన్నే కుట్ర పూచిక పుళ్లతో సమానం.
ఒక్క సారి మా ప్రాంతానికి రా కమ్యూనిజం అంటే నీకు చూపిస్తా...... నిజంగా దీన్ని పాజిటీవ్‌గా గా తీసుకోగలవు దీనికి కూడా విమర్శలు నీదైన శైలి రాస్తావు రాయగల సామర్థ్యం నీకు ఉంది కానీ ఒక్క సారి.... ఒకే ఒక్క సారి పాజిటీవ్‌గా ఆలోచించి కమ్యూనిజం గురించి కనీసం తెలుసుకోగలవు.....
"గాయ పడ్డ పక్షులకు మందుపూసి మాన్పడం
రాలిపడ్డ పూమొక్కల సుమమాలగా కూర్చడం
మనిషిని ప్రేమించడం
మట్టిని ప్రేమించడం
చెమటను ప్రేమించడం
చెట్టును ప్రేమించడం..
నీ సహజ గుణమయ్యి వర్థిళ్లుతుంది
అది గులాబీల వణమయ్యి గుబాలిస్తోంది
ఒక్క రోజైనా ఒక్క సారైనా కమ్యూనిస్టుగా బ్రతుకు నేస్తమా
ఆ గొప్పనీకు తెలుస్తుంది మిత్రమా
అచట మానవతే విలసిల్లును మిత్రమా....."
No comments:
Post a Comment