(మలక్ పేట రౌడి ) : చికాగోలో కమ్యూనిజం గురించి మాట్లాడు. చెప్పు తీసుకుని కొడతారు.....
అని రాసిన మలక్ పేట రౌడి గారికి ... సమాదానంగా.
ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. చరిత్ర చదువు అనవసరంగా ఏది పడితే అది కూయకు. )
అని రాసిన మలక్ పేట రౌడి గారికి ... సమాదానంగా.
- అవునూ మళ్లీ ఇంకోసారి అనేవు నిజంగానే చెప్పుతో కొడుతారు. ఎందుకంటే....? నేను చెప్పింది. నీలాంటి చిల్లర రాజకీయాలు... ఓట్ల గురించి కాదు. ప్రపంచ కార్మికులందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే చికాగో కార్మిక పోరాటం గురించి పని గంటల భారాన్ని 14 గంటల నుండి 8 గంటలకు తగ్గించాలంటూ వేల మంది కార్మికులు చిందించిన రక్తం నుంచి పుట్టిన ఎర్ర జెండా గురించి.
ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. చరిత్ర చదువు అనవసరంగా ఏది పడితే అది కూయకు. )
- తెలంగాణా సాయుదపోరాటం గురించి మాట్లాడే ముందు ఒక సారి ఆ నాటి తెలంగాణా ప్రజల దుర్భర పరిస్థితి తెలుసుకుని మాట్లాడు దొరలు పెట్టే బాధలు భరించలేక నైజాము సర్కారు వేసే పన్నులు కట్టలేక (అసలు వాళ్లకు తినడానికి బుక్కెడు గంజి నీళ్లు ఉంటే కదా ఇంకా పన్నులు కట్టడానికి) వాళ్లు పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక, వెట్టి చాకిరి చేయలేక, తిరగబడ్డ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గురించి అవహేళనగా మాట్లాడే నీతో... మళ్లీ కమ్యూనిజం గురించి చర్చించటం అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే.
- కమ్యూనిజం అంటేనే ఐడియల్..... దానికి నీ వంకర సూత్రాలు అనువదించకు.
- ఏసి గదుల్లో కంప్యూటరు మీద వేళ్లు ఆడిస్తూ గడిపే మీకేం తెలుసు మా పేదల బాధలు.
- సిస్టమ్ (కంప్యూటర్) మీద కూర్చుని సిద్ధాంతాలు వల్లించడం కాదు ఒక సారి బయటికి వచ్చి చూడు.
- పార్లమెంటు లో సీట్లు కాదు ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలు చూడు....
- మొన్నటికి మొన్న గ్రామ సేవకుల హక్కుల గురించి నెల రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టి, ఏ ఆదారం లేని పారిశుధ్య కార్మికులకు కనీసం వేతనం వచ్చేట్లు చేసింది కమ్యూనిస్టులు కాదా....
- పేద పిల్లల ఆలనా పాలన చూసుకునే అంగన్వాడీల హక్కుల కోసం పోరాడి... సాధించుకున్న డిమాండ్స్ కనిపించడం లేదా ...
- బీడీ కార్మికుల హక్కుల గురించి పోరాటం సాగించి విజయం సాధించింది తెలియదా.... ( 1000 బీడీలకు 65 రూపాయలు ఉంటె 130 రూపాయలకు పెరిగింది)...
- ఎయిడ్స్, లాంటి మహమ్మారి వ్యాదుల గురించి, అంటు వ్యాదుల గురించి నిత్యం గ్రామీణ ప్రజల్లో అవగాహన కలిగించే ఆశా వర్కర్స్ కు గ్రామ వాలంటీర్స్ కు, వేతనాలు ఇవ్వ కుండా ఈ గ్రామీణ ఆరోగ్య వ్యవస్తను నిర్వీర్యం చేసి, ప్రైవేటు వారి శ్రేయస్సు కోసం పన్నిన కుయుక్తులను బట్టబయలు చేసి, ప్రభుత్వం మెడలు వంచి వారి షరతులను నెరవేర్చింది కేవలం ఎర్ర జెండా మాత్రమే.
- ప్రజలందరికీ ఏ సమయంలో ఆపద వచ్చినా తామున్నామంటూ వచ్చే 104/108 సిబ్బంధి కనీసం వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే, ఎర్ర జెండా వారికి ఆలంబననిచ్చి, వారి హక్కులకోసం నేడు ఉదృతంగా ఉద్యమాలు చేస్తున్నది... రెండు రోజులు వరుసగా పేపరు చూడు తప్పకుండా ఎర్ర జెండా అండతో వారి డిమాండ్లు నెరవేర్చుకుంటారు.
- ఈ ఈ ఉద్యమాలు అన్నీ ఈ నెలలో కమ్యూనిస్టులు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల పక్షాన నిలిచి చేసిన ప్రజా ఉద్యమాలు.
- ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముందుండి పేదవారి సమస్యలు తీర్చేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అని మర్చిపోకు.
కామ్రేడ్, నువ్వు కమ్యూనిస్టు ఉద్యమానికి అన్యాయం చేస్తున్నావు. ఈ కంప్యూటర్లు ఎంత మందికి ఉపాథి లేకుండ చేస్తున్నాయో తెల్స. అలాంటి బుర్జువా కంప్యూటర్లు నీలాంటి కామ్రేడ్ ఉపయెగించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్ర అన్యాయం మరియు చాలా బాథాకరం
ReplyDeleteచైర్మన్ మావో జిందాబాద్.
ఇండియాని చైన లో విలీనం చేయాలి.
కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాలి.
అన్ని ప్రైవట్ కంపని లని ప్రభుత్వ పరం చేయలి.
దేశం లో కంప్యూటర్లు నిషేదించాలి.
ఇంటెర్నెట్ బుర్జువాల కుట్ర దాన్ని నిషేదించాలి.
btw I don't even find a single reference to Chicago here http://en.wikipedia.org/wiki/Eight_hour_day. where did you get that from. May be you would have found it Romila Thapar's history books
baagundi mee udyamaala patla sahaanubhuti. meelaanti yuvakula aadarana entainaa avasaram.. Long live the spirit of May Day..
ReplyDeletewhy do you want to even talk to him. He is not worth talking to. Malak cannot be called any creature. Don't dignify him by reacting to his words. His brains are only for illogical logic. Just don't even bother about him. He is good for nothing.
ReplyDeleteశివ గారూ మీ వెటకారం చాలు. మేడే వుద్యమ స్ఫూర్తి తెలిసే మీ బూర్జువా పార్టీలు కూడా ఎగబడి ఆరోజు జెండాలెగరేస్తాయి. అప్పటి 14 గం.ల పనివిధానమే వుండి వుంటే తమరు పుట్టివుండే వారు కాదు. పెట్టుబడిదారీ శ్రమదోపిడీని వ్యతిరేకించిన చికాగో అమరుల రక్తంతో ఎగిరిన ఎఱ జెండా నీడవలన ఇప్పుడువున్న రాయితీలను అనుభవిస్తున్నామన్నది గ్రహించండి.
ReplyDelete