జపాన్ ను సునామి, భూకంపం కబళించింది సుమారు పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఆచూకి లభించడం లేదు. ఇదిలా ఉంటె అసలు సునామి జరిగిన రోజు ఎం జరిగింది? అంటే మీడియా దగ్గర ఉన్న సమాచారం కంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
"అప్పటికే సునామి ప్రమాదం ఉందనే సమాచారం లభించడం తో అక్కడ ఒక అధికారి అప్పుడే సునామి వస్తే ఎం జాగర్తలు తీసుకోవాలో చెప్పి వెళ్లి పోయాడు. అతను వెళ్ళిన ఒక అర గంటకు గోధుమ రంగు రంగులో ఉన్న ఒక పెద్ద అల నురుగులు కక్కుతూ చాలా ఉదృతంగా వస్తోంది. అది గమనించిన అక్కడి ప్రజలు జాగ్రత్త పడే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది.
అక్కడే ఉన్న ఒక వ్యక్తి చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం తో పాటు, గగుర్పాటు కలగక మానదు. అప్పటికే సునామి హెచ్చరికలు రావడం తో కుటుంబం తో సహా కొండ పైకి ఎక్కి కూర్చున్న ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న ఇస్త్రీ పెట్టె బంద్ చేసేందుకు వెళ్ళాడు. అతను బయటికి వచ్చె లోపే ఒక పెద్ద అల అర కిలోమీటర్ దూరం నుంచి ఉదృతంగా వస్తోంది. అది చూసి బయపడిన ఆ వ్యతి కార్ స్టార్ట్ చేసేలోపే ఆ అల ముంచేసినంత పని చేసింది. కార్ స్టార్ట్ చేసి గంటకు డెబ్బై కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంటే కార్ వెనకే వస్తోన్న ఆ అలను ఎలాగోలా తప్పించుకున్నాడు. ఆ వ్యక్తీ మరుసటి రోజు వచ్చి చూసే సరికి వాళ్ళకు సంబందించినవి ఏమి లేవు అంతకు ముందు ఉన్న ఇళ్ళ ఆనవాళ్ళు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. అక్కడ స్కూల్ కి వెళ్ళే పిల్లలకు సునామి వచ్చిన విషయమే తెలియదంట. స్కూల్ కొండ మీద ఉండటం తో ఆ విద్యార్తులు స్కూల్ కి వెళ్ళిన తర్వాత జరిగింది కనుక వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఆ రోజు ఆ విద్యార్థులను అక్కడే ఉంచారు. మరుసటి రోజు వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసికెల్లగానే అది చూసిన పిల్లలు తమ ఇల్లు లేదని బోరున విలపిచారు. " అక్కడి వారి ఆర్తనాదాలు, తమ వాళ్ళని కోల్పోయి నిస్తేజంగా మారిన వాళ్ళ జీవితాలు చూస్తుంటే హృదయం చలిచిపోతోంది.
సుందర్
No comments:
Post a Comment