ఈ రోజు ఉదయం కాలేజ్‌కి వెళ్లాను సోమవారం నుంచి ఇంటర్నల్స్ ఉండటం వల్ల కాలేజ్‌లో మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ ఇవ్వడం కాదు మాటర్ అది జిరాక్స్ తీసుకెళ్లడానికి వెల్లిన నాకు ఒక సంఘటన ఆశ్చర్య పరిచింది. నలుగురైదుగురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలంటే ఏదో అనుకోకండి ఏ ఒక్కరికీ పది సంవత్సరాలు దాటి ఉండవు ఏడెనెమిది సంవత్సరాల వయసున్నవారే. వారి లో ఒక అమ్మాయి చేతిలో రెండు కట్టెలు ఉన్నవి. అవి పట్టుకొని కొడుతూ.. కాచిగూడలోని ప్రతీ షాపుకు తిరిగుతూ హోళీ చందా అడుగుతున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకోకండి. వారు ఇంత చిన్నగా ఉన్నారు. ఎలాగ అడుగుతారబ్బా అని చూస్తున్నాను. వారు షాపుకు వెళ్లి షాప్‌లో ఉన్న కంప్యూటర్ కీబోర్డును నొక్కుతూ... అక్కడ ఉన్న టైప్ రైటింగ్ మిషన్ బటన్లను నొక్కుతూ.. దర్జాగా అడుగుతున్నారు. వాళ్లు చూస్తే ఏమన్నా అంటారేమో అనుకున్నా ఆ షాపు వాళ్లు కూడా ఏమనడం లేదు. వారు రాగానే రెండు రూపాయలు తీసి చేతిలో పెట్టారు. ఆ.. ఈ రెండు రూపాయలేనా...? ఐదు... పది రూపాయలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీకు ఇవే ఎక్కువ అనగానే కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేసి వెళ్లిపోయారు. కాని వాళ్లలోని ఆ కాన్ఫిడెన్స్‌ను చూస్తే... అబ్బ చాలా ఆశ్చర్యమనిపించింది. అంతే కాదు... వారు అడిగే విధానం... కూడా చాలా నచ్చింది. కానీ ఈ శక్తిని వారికి ఇచ్చింది. మాత్రం హోళీ అన్నది మరవకూడదు. అదే చిన్నారులు వేరే సందర్భాలలో కనీసం ఆ షాపుల దగ్గరకు కూడా రానీయరు అలాంటి వారు డిమాండ్ చేసేలా చేసింది. కేవలం
హోళీ మాత్రమే....
హోళీ శుభాకాంక్షలు హోళీ మాత్రమే....
సుందర్
No comments:
Post a Comment