అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, March 20, 2011

బయటికి లాక్కురావడం రచ్చరచ్చ చేయడం...!

ఈ రోజు జరిగిన హోళీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్నంలో, పల్లెల్లో ప్రజలు ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ఈ పండగలో చాలా ఎంజాయ్  చేశారు. రంగుల్లో, మునిగి తేలుతూ, కేరింతలు కొడుతూ రోడ్లెంబడి షికారు కొట్టడం అమ్మాయిలయితే ఇదే చాన్స్‌ అన్నట్లు కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ... అబ్బో వాళ్లను ఆపడం.... ఎవరి తరం కాదు... ఇకఅబ్బాయిల స్టైలే వేరు ఎవ్వడయితే హోళీ ఆడనంటూ ఇంట్లో దాక్కుంటాడో వాన్ని బయటికి లాక్కు రావడం రచ్చరచ్చ చేయడం... మళ్లీ కొత్త వానికోసం పరుగులు పెట్టడం... ఇలా మధ్యాహ్నం వరకూ... కేరింతలు కొడుతూ.. ఉరుకుతూ... రంగులు జల్లుకుంటూ... ఎంజాయ్  చేసిన వాళ్లు మధ్యాహ్నం తరువాత మాంచి పార్టీలు చేసుకుంటూ.... మజాను... ఆస్వాదిస్తుంటారు....
సుందర్

No comments:

Post a Comment