అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, October 20, 2012

అరుణకిరణం ఆజాద్‌

1921లో గాంధీజీ పిలుపునిచ్చిన సహాయనిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితులై ఎంతో మంది దేశవ్యాప్తంగా తరలివచ్చారు.  ప్రభుత్వ కొలువులను త్యజించారు  విదేశీ వస్తువులను స్వచ్చందంగా  భహిశ్కరించారు . విద్యార్థులు బడులకు, కాలేజీలకు వెళ్లకుండా ఉద్యమంలోకి దూకారు. ఈ తరుణంలో విరిసిందో అరుణ కిరణం. 15ఏండ్ల వయస్సు నూనూగు మీసాల ప్రాయంలో కదనరంగంలోకి దుమికిందా సింహం.. పోలీసులు అరెస్టు చేసి మెజిస్ట్రేటు ముందు నిలబెట్టారు. మెజిస్ట్రేటు నీ పేరేమిటీ అని అడిగితే 'ఆజాద్‌' (స్వేచ్చ) అని సమాధానం, చెప్పాడు... మీ నాన్న పేరు ఏమిటీ అనే ప్రశ్నకు 'స్వాతంత్య్రం' అని బదులిచ్చాడు.  నువ్వు ఉండేది ఎక్కడ అని అడిగితే ధైర్యంగా 'చెరసాల'లో అని చెప్పడంతో... కోపంతో ఊగిపోయిన మెజిస్ట్రేటు 15 కొరడాదెబ్బలు శిక్షవేయగా.. ప్రతీ దెబ్బకు ఆకాశం దద్దరిల్లేలా  'భారతమాతాకీ'జై అని నినదించాడు. దెబ్బదెబ్బకూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడే గానీ క్షమాపణలు కోరలేదు. అతడే షాహీద్‌ చంద్రశేకర్‌ తివారీ ఆజాద్‌. ఆరోజు నుండి అతన్ని ఆజాద్‌గా పిలుచుకుంటున్నాం.
అతనే ముందు ముందు కాలంలో స్వాతంత్య్రోద్యమంలో, రాంప్రసాద్‌ బిస్మల్‌ స్థాపించిన హెచ్‌ఆర్‌ఎ (హిందుస్తాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌) ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాతి కాలంలో హెచ్‌ఆర్‌ఎను భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ మొదలైన వారితో కలిసి, హెచ్‌ఎస్‌ఆర్‌ఎ (హిందుస్థాన్‌ సోషలిస్ట్‌, రిపబ్లికన్‌ అసోసియేషన్‌) పొందించడంలో కీలక పాత్ర పోషించాడు.
లాలా లజపతి రాయ్ ను  హత్య చేసిన పోలీసు అధికారి సాండర్స్‌ను అంతమొందించడంలో చురుకైన పాత్ర పోషించాడు. (కానీ వారు చంపింది సాండర్స్‌ కాదని తర్వాత తెలసింది). స్వాతంత్రోద్యమంలో  కీలక పాత్ర పోషించాడు.
పార్లమెంట్‌పై పొగబాంబు వేయడంతో మరణశిక్షకు గురైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల శిక్షను రద్దు చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు నెహ్రూని కలిసినా ఫలితం లేకుండా పోయింది.
ఫిబ్రవరి  27, 1931లో ఆల్ఫ్రైడ్‌ పార్క్‌లో ఉన్న ఆజాద్‌ను పసిగట్టిన పోలీసులు కాల్పులు జరిపాడంతో ముగ్గురిని చంపి, ముష్కరుల తూటాలకు  బలవ్వడం ఇష్టంలేక తన పిస్టల్‌తో తనే కాల్చుకుని అమరుడైనాడు...
 ఆయన త్యాగం అజరామరం.
ఆజాద్‌ నీ రూపం మా కళ్లల్లో
నీ త్యాగం మా గుండెల్లో... 
జోహార్‌.. అమరుడా చంద్రశేఖర్‌ ఆజాద్‌.... 
సుందర్

No comments:

Post a Comment