ఒరేయ్ దళితుడా..
అది కంచకచర్లైనా, కారంచేడైనా , చుండూరయినా, లక్షిం పేటయినా..
నీ చావు ఓ వార్త మాత్రమేరా.. టీవీలకు ఓ సెన్సేషన్ న్యూసేరా..?
నిన్ను 3000 సం.ల క్రితమే ఊరి చివరికి విసిరి పారేశాం..
ఇప్పటికీ గుడి మెట్టునే తొక్కనీయడం లేదు..
బడిలోపల ఎలా ఎదగనిస్తామనుకున్నావ్ రా..?
గత రెండు సంవత్సరాల నుండి అదే యూనివర్సిటీలో 9 మంది దళిత విద్యార్థులను చంపేశాం..
అప్పుడెవడేం పీకాడురా..?
ఇప్పుడో 'దళిత' విద్యార్థి 'ఆత్మహత్య' చేసుకున్నాడంటూ.. అన్ని మీడియాల కెమెరా లెన్స్ HCUపైకి జూమ్ చేశాయి..
వాటికి నీ చావు మీద జాలిలేదురోయ్.. ఆ వార్త ఇచ్చే రేటింగ్ పై మోజు మాత్రమే...
ఎవడు కూసాడు రా నీది ఆత్మహత్య అనీ..
హైదరాబాద్ బాద్ నడిబొడ్డులో.. ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన 'మర్డర్'..
'ప్లాన్డ్ మర్డర్'..
మనువాద హిందూ విద్యార్థి సంఘం ఏబీవీపీ కుట్రపన్నింది..
మతపిచ్చి బీజేపీ పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ లెటర్ రాసి స్కెచ్ గీశాడు..
ఆ లెటర్లను చూసి మరో మంత్రి స్మృతి ఇరానీ.. చేతిలో ఉన్న ఫవర్ ని అడ్డగోలుగా ఉపయోగించి..
'ఒత్తిడి' పెంచింది.. ఈ తతంగానికంతటికీ వీసి అప్పారావు వంత పాడాడు..
గత 14 రోజుల నుండి విద్యార్థులను గెంటేశాము..
ఆరుబయటే పండబెట్టాం..
చివరకు నలువైపుల నుండి నీ ఊపిరాడకుండా చేసి ఓ నిండు ప్రాణాన్ని తీశాము..
అందరం కూడబలుక్కుని చంపేశాము..
నీ నిస్సహాయత గొంతు నులిమాము..
నిన్ను చేతగానివాడ్ని చేసి నీతో నిన్నే మర్డర్ చేయించాం..
కనీసం ఒక్కడంటే ఒక్కడికైనా నీది 'హత్య' అనే దమ్ముందా..??
ఏం తెలియని రోజుల్లో.. ఏ సాయంలేని చీకటి రోజుల్లో 'దాదాసాయేబ్' తిరగబడ్డాడు..
మతాన్ని కాల్చి పాడేశాడు....
ఒంటరిగా.. 'రాజ్యా'న్ని కాళ్ల కింద వేసి తొక్కి పాడేశాడు..
రాజ్యం.. మతం కూడబలుక్కుని చేసిన మర్డర్ ను ప్రశ్నించే దమ్ము నీకుందా..?
తిరగబడగలవా..? తలబడి నిలబడగలవా..??!
చల్ నా కొడకా..
సిగ్గు, లజ్జా, ఆత్మాభిమానం ఉంటే..
రా.. వచ్చి నీ దమ్మేందో చూపించు..
నీ సోదరుడిని చంపిన మనువాదాన్ని మంటల్లో కాల్చేయి..
రాజ్యాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకో..
లేదంటే..
నీ అక్కలు.. చెల్లెళ్లు.. చెరచబడుతూనే ఉంటారు..
అన్నలూ తమ్ముళ్లు చంపబడుతూనే ఉంటారు..
'తెగబడి అరాచకం రాజ్యమేలుతుంటే..
నిలబడి చూస్తావేం వందసార్లు చస్తావా..??'
సుందర్
No comments:
Post a Comment