అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, October 20, 2012

తుపాకీ తూటాలు.. నిన్ను గాయపర్చిఉండొచ్చుగాక నీ సంకల్పాన్ని కాదు..

ఆడపిల్లల చదువుపై తాలీబాన్‌ల వైఖరిని ఖండించిందో  బాలిక. నిండా 15 ఏళ్లు లేవు. అయినా చదువంటే ప్రాణం... చదువుకోనివ్వకుంటే... కోపం. వయసు చిన్నదైనా ఆలోచనలు చాలా విశాలమైనవి. 'గుల్‌మకాయ్' బ్లాగులో తాలీబాన్ల కిరాతక ఆంక్షలను కలంతో ఖండించింది. తనకు తెలుసు వ్యతిరేకిస్తే జరిగే పరిణామం. అదరలేదు బెదరలేదు... వెన్నుచూపి పారిపోలేదు. చీల్చే గుండుకు ఎదురొడ్డి నిల్చుంది. తనే పాకిస్తాన్‌ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్ ,
ఇప్పుడు బ్రిటన్‌లో చికిత్సపొందుతుంది. చదువే ప్రాణమంటూ.. బాలికల విద్యకోసం నినదించిన గొంతును నొక్కేశామనుకుంటున్నారు. ఇప్పుడు ఎదొందల కోట్ల గొంతుకలు ఒక్కటయ్యాయి. ప్రపంచంమొత్తం మలాలా కోలుకోవాలని కోరుకుంటోంది. విజ్ఞానాన్ని బంధిచడం ఎవడి తరం కాదు..

విద్యావికాసానికి ఊపిరి నీ తిరుగుబాటు
తుపాకీ తూటాలు..
నిన్ను గాయపర్చిఉండొచ్చుగాక
నీ సంకల్పాన్ని కాదు..
నీ ఆశయం..
జగతికి ఆదర్శం...
నీ మార్గంలో...
కదిలొస్తాం...
నిరంకుశ తూటాలకెదురొడ్డి....
 
సుందర్

No comments:

Post a Comment