అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, December 6, 2012

ట్యూషన్‌ మళ్లీ స్టార్ట్‌ కావాలి

మొన్న రాత్రి ఊరెళ్లాను. మా యూత్‌ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కొరకు నడిపించే ఉచిత ట్యూషన్‌కు కొన్ని అనివార్య కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. ఆ ట్యూషన్‌ గత నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తోంది. గత  మూడు సంవత్సరాలనుంచి వరుసగా ముగ్గురు విద్యార్థులకు ట్రిపుల్‌ఐటి సీట్లు సాధించారు.  సాధారణ విద్యార్థులు కూడా మాంచి పర్సంటేజీతో ర్యాంకులు సాధించడంలో ఈ ట్యూషన్‌ తోడ్పాటు ఎంతో ఉందని ఊరివాళ్ల అభిప్రాయం.
అటువంటి ట్యూషన్‌ ఆగిపోవడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులూ, భాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దాని గురించి చర్చ ప్రారంభించాము. అందరూ చాలా కారణాలు చెప్పారు. కొంత మంది ట్యూషన్‌ బంద్‌చేయడమే మంచిదని...  ఎందుకంటే ట్యూషన్ చూసుకునే వారు లేరు. నేనూ మా ఫ్రెండ్ నవీన్ అప్పట్లో ట్యూటర్స్ గా, కేర్ టేకర్స్ గా ఉండేవాళ్ళం.  ఇప్పుడు చదువు నిమిత్తం ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాం. ఊళ్ళో చాలా మంది ఉన్నా పూర్తి టైం  కేటాయించే వాళ్ళు లేరు.
అరకొరగా నడిచే బదులు అసలు బంద్ చేయడమే బెటర్ అన్న వాదన వచ్చింది. దాన్ని నేను కూడా సమర్ధించాను. దీంతో ట్యూషన్‌ బంద్‌ చేయించాలన్న వాళ్ల వాదన బలపడింది.
తర్వాత ఇంటికి వెళ్లా నైట్‌ నిద్ర పట్టడం లేదు. నేను చెప్పినమాటలే పదే పదే గుర్తొస్తున్నాయి.
కొద్దిసేపటికి మళ్లీ ఊరి వాతావరణం గుర్తొచ్చింది.

మా ఊరి విద్యార్థులు మా టౌన్‌ ఫస్ట్‌ వచ్చినప్పుడు పొందిన సంతోషం.. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఆప్యాయంగా స్వీట్లు తెచ్చి ఇచ్చినప్పటి తీపి సంఘటనలే గుర్తొస్తున్నాయి. 


ఎలాగైనా ఈ వారంరోజుల్లో ట్యూషన్‌ మళ్లీ స్టార్ట్‌ చేయాలి.
అని తెల్లవారాక మాఫ్రెండ్స్‌తో చర్చించాను. వారం లో ఒక రోజు మేము కేటాయిస్తాము. ఒక్కో రోజు కనీసం ఒక్కరి చొప్పున అయినా కేటాయించాలి. ఒకవేళ ఎవ్వరు లేకున్నా విద్యార్థులు కంబైన్డ్ స్టడీ చేసుకుంటారు కదా...? ఇంటి దగ్గర కూర్చుని సీరియల్లు చూసే బదులు ఇక్కడ కూర్చుని చదువుతారు. అని మాట్లాడుకున్నాము. మిత్రులు కూడా ఆలోచన బానే ఉంది అన్నారు. రెండు రోజుల్లో ట్యూషన్ స్టార్ట్ చేస్తాం అన్నారు.
  ట్యూషన్‌ మళ్లీ స్టార్ట్‌ కావాలి విజయవంతంగా నడవాలి అనే ఆలోచనతో పట్నం దారిపట్టాను..
నడవాలి.. నడిపించాలి... 

సుందర్

1 comment:

  1. ఇప్పుడు ట్యూషన్‌ యథావిదిగా నడుస్తోంది. చాలా మంది క్లెవర్‌ స్టూడెంట్స్‌ ఉన్నారు. ఈ యేడు కూడా మా ఊరి వాళ్లే స్కూల్‌ టాపర్‌ రావాలని ఆశిస్తూ...

    ReplyDelete