అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, January 5, 2013

ఆల్‌ఖైదా ఉగ్రవాది కంటే ప్రమాదకరం..


  • "100కోట్ల మంది హిందువులున్నదేశంలో.. మేం 20 కోట్లమందిమి ఉన్నాము ఒక్క 5 నిమిశాలు వదిలేయండి తడాఖా చూపిస్తాం.. 
  • కసబ్‌ ఒక ముస్లిం అయినందుకే ఉరితీశారు...!"

ఈ మాటలన్నీ అన్నది ఏ ఆల్‌కైదా ఉగ్రవాదో కాదు....... హైదరాబాద్‌ నా అబ్బసొమ్మన్నట్లు ఫోజులిచ్చే ఒక బడా రాజకీయ నాయకుడు.. హైదరాబాద్‌కు విదేశీయులు, తమ తాతలు కట్టించిన కట్టడాలను మాత్రమే చూడటానికి వస్తారంటూ ఫోజులు దొబ్బుతున్నాడు... ఆ కట్టడాలు మా భారత దేశ వారసత్వ సంపదరా.. మీ తాతలు రాళ్లెత్తలేదు.. ప్రతి కట్టడంలో అన్ని మతాల వాళ్ల చెమటచుక్కలు దాగిఉన్నాయి...

  • హిందూ రౌడీ షీటర్లు సంవత్సరంలో రెండు పండగలకు మాత్రమే పోలీసు స్టేషనుకెళ్తారు.. అదే ముస్లిం రౌడీ షీటర్‌ అయితే ప్రతి పది రోజులకూ వెళ్లాలి.. అంటూ రౌడీలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. అంటే వీడికి రౌడీలు పోలీసు స్టేషనుకు వెళ్లడం ఇష్టం లేదు.   అంటే ఆ రౌడీలు  పండగరోజుల్లో బయటే ఉండి,  గొడవలు చేసి, కల్లోలాలు సృంష్టిచాలనా వీడి ఉద్దేశ్యం ...???  

ఇంకా ఇలాంటివి చాలా చాలా కూసాడు..
ఇలాంటి వాడు ఆల్‌ఖైదా ఉగ్రవాది కంటే ప్రమాదకరం. ఒక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. బహిరంగంగా ఇన్ని మాటలంటే.. మరి అంతర్గతంగా ఎంత రెచ్చగొడతాడు..

ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక దేశం మనది. హిందూ ముస్లిం భాయీ.. భాయీ అనుకునే భారతదేశంలో మత కల్లోహాలెందుకొస్తాయంటే వీడిలాంటి వాళ్లవళ్ళే.

ఇలాంటి  చీడ పురుగులు,  తమ స్వార్ధం కోసం, ఎన్నికల ముందు ఎలాగైనా పార్టీ   ప్రాభల్యాన్ని పెంచుకోవడం  కోసం, రెచ్చగొట్టే  మాటలతో మనుషుల మధ్య మనసుల మధ్య వైషామ్యాలు పెంచి పోషిస్తుంటే ఏం ఎరుగతని అమాయకులే ఇందులో సమిదలవుతున్నారు. ఇలా మనుషులను రెచ్చగొట్టి మనోభావాలను దెబ్బతీసే వాడు ఏమతానికి చెందిన వాడైనా కఠినంగా శిక్షించాలి. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదించాలీ. జీవితాంతం జైలులోనే ఉంచి, రాజకీయ భవిష్యత్‌ లేకుండాచేయాలి.

కొంత మందికి ఇది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుండొచ్చు. కొమ్మకు తెగులు పడితే చెట్టే నాషనమైపోతోంది. ఇలాంటి వాన్ని ఊరికే వదిలితే భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని సంకలో ఎత్తుకుని తిరుగుతున్నట్టే.

'భారత దేశంలో మతాన్ని అమ్మలా భావిస్తాం.. మన అమ్మ అయినా పక్కోడి అమ్మయినా అమ్మ అమ్మే... అమ్మను పవిత్రంగా చూద్దాం.'


 
సుందర్

1 comment: