అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, January 9, 2013

అయ్యా గురివింద సామి.. !

అన్నయన్నంతన పిశాచాల మనసుకరుగునా...
బతిమాలనంతన చెరబడుదురందువా...
ఏమి "ఆశ రామ సామి"... ఇదీ ....!

ఒక్క చేయి కదిపితే సప్పుడవదందువా..

రావణుడపహరిస్తుంటే సీత చేయి కలిపిందా...?
కీచకుడు చెరబడుతోంటే ద్రౌపతి వేడుకోలేదా....??
అన్యాయానికి గురైన అబల గూర్చి అన  నీకు  నోరెట్లొచ్చె  సామీ..!!


అయ్యా గురివింద సామి..
నీవు గజమా...

ఎట్లా...

ఆశ్రమపేరుతో అభాగ్యుల భూమి కాజేసినందుకా..
బాగోతం.. బయటేసినోడి అంతుజూసినందుకా..
లేక.. సంటిపిల్లల ఉసురు బోసుకున్నందుకా..


నీ ఆటలు ప్రపంచానికెరుక..
నీ డ్రామాలు ప్రచురించిన మీడియా శునకం కాదు స్వామో..
అది గాండ్రించే బొబ్బిలి...

నీవు గజమెమో గానీ...
నీకు గజగజ పుట్టుడూ....
"గజం" తడుసుడు ఖాయం...

ఇక పలాయనం తథ్యం..
 
సుందర్

No comments:

Post a Comment