అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 28, 2013

ఈ గణతంత్య్ర దినోత్సవం నాకు మాంచి... (గుణ)పాఠమే చెప్పింది..

అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది.. టీచర్  పాఠం చెప్పి పరీక్ష పెడితే.. జీవితం పరీక్ష పెట్టి పాఠం చెబుతుందంటారు.. ఈ గణతంత్య్ర దినోత్సవం నాకు మామూలుగా  కాదు మాంచి... గ(గు)ణపాఠమే చెప్పింది..

విషయంలోకి వెలితే.. గణతంత్య్ర దినోత్సవం రోజు ప్రజాశక్తి హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీసులో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా భాగా చేస్తారు. ఆ కార్య్రక్రమాల్లో నేను కూడా ఒక పాట పాడుదాం అనుకున్నా. ఏం పాట పాడాలా..! అని చాలా సేపు ఆలోచించి...? చించీ... ఎవరో రాసిన పాట మనమెందుకు పాడటం... మనమే ఒక పాట రాస్తే పోలా..!!  అని ప్రోగ్రాం ముందు రోజున సాయంత్రం 4.30 కూర్చుని 8.30 వరకు దాదాపు నాలుగంటల పాటూ కూర్చుని పాట రాశాను. నైట్‌ డ్యూటీకి వచ్చాను. డ్యూటీ పూర్తయ్యే సరికి 2.30 అయింది. నేను రాసుకున్న పాటను మా ఫ్రెండ్స్‌కు చూయించాను.  కొంతమంది బాగుంది అన్నారు. ఒకరిద్దరు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.
తెల్లారితే ప్రోగ్రాం ఇక ప్రాక్టీసే మిగిలింది.. ఎక్కడ చేయాలీ.. అని భాగా ఆలోచించా.. ఎందుకంటే నైట్‌ ఆఫీస్‌లో ప్రాక్టీస్ చేస్తూ పాడుతుంటే చాలా మంది డ్యూటీ పూర్తి చేసి పడుకుని ఉంటారు. ఇంకొంత మందిడ్యూటీలో ఉంటారు. వాళ్ళను డిస్ట్రబ్‌ చేయడం ఎందకు అని భాగా ఆలోచించాను.. చివరికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. మా ఆఫీసులో ఫ్రింటర్‌ రూం మొత్తం గ్లాసెస్‌తో ఉంటుంది. కాబట్టి మనం ఎంత గొంతు చించుకుని  పాడినా...?? ఎవ్వరికీ ఇబ్బంధి ఉండదు. తట్టిందే తడవుగా ప్రాక్టీసు స్టార్ట్‌ చేశాను. పాడటం మొబైల్‌లో రికార్డు చేయడం. ఔట్‌పుట్‌ ఎలా వచ్చిందా అని వినడం... పాడటం మొబైల్‌లో రికార్డు చేయడం... ఔట్‌పుట్‌ ఎలా వచ్చిందా అని వినడం... ఇలా ఒక యాబై అరవైసార్లు.. ఇంకా భాగా రావాలి... ఇంకా బాగా రావాలి అంటూ..., కొన్ని ప్రదేశాల్లో లిరిక్స్ మార్చుకుంటూ..ట్యూన్ ఇంప్రూవైజ్ చేస్తూ.. మార్నింగ్‌ వరకూ...ప్రాక్టీసు చేశాను...! 
ఫైనల్లీ ఔట్ పుట్ భాగానే వస్తోంది అని సాటిస్ఫై అయ్యాను. టైం ఉదంయం 6 అవుతోంది. 9కి ప్రోగ్రాం... ఇక రూంకి వెళ్లి ఫ్రెష్‌ అప్‌ అయ్యి వద్దామని బయల్దేరా. మధ్యలో ఫ్రెండ్స్ కలిశారు. వారు కూడా నైట్‌ 3 గం|| వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రిహార్సర్స్ చేశారట. వారితో పాటు పొద్దుపొద్దున వేడివేడి చాయ్  తాగి.. రూంకి వెళ్లాను.
నాకు తెలుసు నేను పడుకుంటే పిడుగులు పడ్డా.. లోకాలు కూలిపోయినా లేవను అని... కాబట్టి పడుకోవద్దని ఫుల్‌గా డిసైడ్‌ అయ్యా... మళ్లీ రాత్రి రాసిన పాటలో ఏమన్నా అక్షర దోషాలు, సాహిత్య దోషాలు ఉన్నాయా అని చూస్తూ... అలా నడుంవాల్చా... ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు.. మధ్యలో ఏదో గుర్తొచ్చినట్లు ఉలిక్కిపడి లేచా.. టైం చూస్తే ... అయ్య్యో ... అప్పటికే 11.30 అవుతోంది.. ఈపాటికి ప్రోగ్రాం అయిపోయి ఉంటుందని అర్థమైంది.. ఏం చేస్తాం.. అని నన్ను నేనే తిట్టుకునీ... ఇక ఈ రోజు నీకు ఫుడ్‌  బంద్‌ అని నాకు నేను శిక్ష వేసుకున్నా.. మధ్యాహ్నం 4.30 వరకూ పడుకునే ఉన్నా...... నిద్ర పట్టకున్నా.....! కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా....!!!


సుందర్

No comments:

Post a Comment