అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, October 18, 2012

కుంబాలు మెక్కేవాడికి ఫుల్‌మీల్స్‌ ఓ లెక్కా...??

కుంబాలుకుంబాలు మెక్కేవాడికి ఫుల్‌మీల్స్‌ ఓ లెక్కా... కాంగ్రెస్‌ మంత్రులకు 71లక్షలు ఒక కుంభణమా..?? అవును మరీ కోటాను కోట్లు 'గాలి'కి కోల్‌గేట్‌లో కొట్టుకుపోతుంటే 71లక్షలు కుంభకోణం ఎలా అవుతుంది.
చేసిన ఘన కార్యానికి మంత్రికి మరో మంత్రి సఫ్పోర్టూ.. అవినీతిలో ఐక్యత అంటే ఇలా ఉండాలి.. ఎందుకంటారా.. భవిష్యత్తులో తాము  దొరికినా... మసిబూసి మారేడుకాయ చేసేవాళ్లు ఉండాలి కదా..
మేసింది స్వయానా 'మహా'తల్లి అల్లుడు వాద్రా   కావడంతో అమ్మ ఆశిస్సులకోసం, అల్లున్ని ఆదుకోవడం కోసం, తిమ్మిని బమ్మిగా చూపేందుకు తారా స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి.
కాబట్టే అవినీతిని ఎత్తిచూపిన అధికారిని ఎత్తి ఏట్లోపడేసారు.. రాజుకు కోపం వస్తే దెబ్బలకు కొదవా...??
అవును మరీ కలికాలంలో మంచికి(నిజాయితీకి) మించిన చెడు ఇంకేముంటుంది చెప్పండి.
ఆటలు సాగుతున్నాయ్ సాగనివ్వండి...
ముందుందిగా 2014 పండగ.... ప్రజలేం కళ్లు మూసుకుని లేరు...
పిండం పెట్టడానికి రెడీగా ఉన్నారు కాచుకోండి అవినీతి అదముల్లారా...!!! 
సుందర్

No comments:

Post a Comment