అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, August 24, 2012

వాళ్ళను గౌరవిద్దాం......!

మొన్న నా ఫ్రెండ్‌ ఒకడు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ షేర్‌ చేశాడు. టి షర్టుల పై చేగువేరా, సుభాష్‌ చంద్రబోస్‌ గార్ల బొమ్మలు ఉన్న  ఫోటోలు పక్క పక్కన పెట్టి 'వై దిస్‌ ట్రై దిస్‌' అనే శీర్షికతో ఉన్న ఫోటో అది. దానికి నేను రియాక్ట్‌ అవుతూ, ''ఇద్దరూ చాలా గొప్పవాళ్లు. స్వార్థమనేదే ఎరుగకుండా ప్రజలకోసం పోరాటం చేసి చివరకు ప్రజలకోసమే ప్రాణాలర్పించిన వాళ్లు వీరిద్దరి మధ్య పోటీ ఏంటి మామ చండాలంగా'' అని కామెంట్‌ పెట్టాను. దానికి ప్రతిగా 'లేదు మామా మరి మన సుభాష్‌ చంద్రబోస్‌ను కూడా గౌరవించాలి కదా కేవలం చేగువేరా టీ షర్టులే వేసుకుంటున్నారు' అని కామెంట్‌ పెట్టాడు నా ఫ్రెండ్‌. దానికి నేను 'మామ గౌరవం అనేది గుండెల్లో ఉంటుంది కానీ టీషర్ట్స్‌ మీద ఉంటుందా.. ఇది కేవలం టీ షర్టుల కంపెనీ వాడి ట్రిక్‌ తప్ప మరొకటి కాదు' అని కామెంట్‌ పెట్టాను. కరెక్టే మామ అని మా ఫ్రెండ్‌ ఒప్పుకోవడంతో ఆ ఆర్గ్యుమెంట్‌ అక్కడికి ముగిసింది.

అయితే  మన వాళ్ళను కూడా గౌరవించాలి కదా  అన్న నా ఫ్రెండ్‌ మాటతో,  నా మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. అదేమిటంటే నేటి యువతకు, కన్వెంట్లలో, కార్పోరేట్ కాలేజీల్లో  చదువుకుంటున్న భావి భారత పౌరులకు, ఎంత మంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసు?? కనీసం ఎంత మంది సమర యోధుల పేర్లు తెలుసు?? స్వాతంత్రోద్యమం అనగానే గాందీజీ, నెహ్రూ అని అంటారు. ఆ పేర్ల తర్వాత  సుభాష్‌ చంద్ర భోస్‌, అంభేద్కర్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సర్ధార్‌ వల్లభాయ్  పటేల్‌, లాలా లజపతిరాయ్, బిపిన్‌ చంద్రపాల్‌, బాలాగంగాదర్‌ తిలక్‌, సుఖ్‌దేవ్‌, కుదిరాంభోస్‌, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కట్టబ్రహ్మన ఇంకా ఎందరో  వీరుల పేర్లు వారి త్యాగాలు చెప్పలేరు.

దీనికి  ప్రధాన కారణం ప్రభుత్వమే...
అందరిలాగే వీడు ప్రభుత్వం .... ప్రభుత్వం అని ఎత్తుకున్నడురా బాబోయ్ అనుకోవచ్చు.. కాని నిజాలేంటో  ఒక్కసారి  చూద్దాం.


 65 ఏళ్ల స్వాతంత్య్రంలో సుమారు 55 ఏళ్లకు పైగా  దేశాన్ని... పరిపాలిస్తూ వస్తోంది  కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఒక ప్రాజెక్టు పేరు పెట్టాలంటే.. ఇందిరా జలప్రభ, రాజీవ్‌ యువకిరణాలు, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, ఇందరమ్మబాట, ఇలా ఎప్పుడూ అధిష్టానం మెప్పు పొందేందుకు, సోనియమ్మ దీవెనెలందుకునేందుకూ... పదవులు పదిలంగా కాపాడుకునేందుకు... తమ పబ్బం గడుపుకోవడం కొరకు... ఎంతసేపు వారి భజన చేయడం తప్ప. ఎంతో మంది స్వాతంత్య్ర సమర యోధులు, స్వాతంత్య్రానంతరం దేశ నిర్మాణానికి, అభివృద్ధికై కృషి సల్పిన అమర వీరుల పేర్లు వారికి గుర్తురావు గుర్తురావు.


స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు, వారి  త్యాగాలు.. జండా పండగరోజు ఉపన్యాసాల్లో కాదు.. నిత్యకృత్యాలలో.. ప్రజలకు ముఖ్యంగా ఇప్పటి విద్యార్థులకు యువతకు.. తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాని అది చేయడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

"మన స్వాతంత్య్రం ఒక మేడి పండు కావచ్చు"... కానీ అది సాధించేందుకు, తెల్లదొరల నిరంకుష పాలనను అంతమొందించేందుకు, భారత మాత దాస్యశృంఖలాలను తెంచేందుకు. పోరు సల్పిన అమర వీరుల చెరసాలు, ఉరికొయ్యలు, చిత్ర హింసలు, తుపాకి తూట్లు, లాఠీ దెబ్బలు, అరణ్యవాసాలు... చరిత్రలో నిలిచిపోవచ్చు....కాలగర్భంలో కలిసిపోవచ్చుగాక... వారి త్యాగాలు   అబద్ధం  కాదు.... "

మన వంతుగా ఫేస్‌బుక్‌, ఆర్య్కూట్‌, బ్లాగ్‌, ట్విట్టర్‌ ఎక్కడ వీలయితే అక్కడ మన స్వాతంత్య్ర యోదుల స్మృతులు, త్యాగాలను భవిష్యత్‌ తరాలకు కొన్ని అయినా పంచేందుకు ప్రతినభూనుదాం....

 
సుందర్

3 comments:

  1. CONGRATULATIONS DEAR FRIEND.
    ON THE COMPLETION OF SECOND
    SUCCESSFUL YEAR OF UR BLOG.

    ReplyDelete
  2. చక్కటి పోస్ట్.

    ReplyDelete