కిటికీలు తెర్సుకుంటే... కరెంటు సమస్య సాల్వ్ అయితదంట అరెవ్వా.... ఏం
జెప్పినవ్ సిఎం సాబ్... గీ విసయం తెల్వక జనాలు, ప్రతి పక్షాలు,
కంపెనీలూ.... కరెంటు సమస్య పరిష్కరించమని రోడ్లపై ధర్నాలు జేస్తున్నారు..
గిదే విషయం తెలిస్తే నిమ్మలంగా ఇంట్లో కిటికీలు దెరుసుకుని కూసుంటోళ్లు
గదా...
పోయిన ఏడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువుంది గీ సారి గది తగ్గింది గందుకనే గిట్ల కరెంటు కట్ జేయాల్సి వచ్చింది అని లెక్కలతో సహా జెప్తున్నవ్.... ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవు మరి గీ విషయంల ముందు సూపు లేకుంటే ఎట్లా... అవున్లే.. నీ సీటు జూసుకుంటందుకే నీకు టైం లేదాయే ఇగ కరెంటు గురించి ముందు సూపు సూస్తందకు నీకు టైం ఎక్కడిది జెప్పు.
నేను నా మంత్రులు గిట్ల కిటికీలు తెరుసుకుంటం మీరు గిట్ల గట్లనే జేయుండ్రి అంటున్నవ్ బాగుంది బాగుంది ముచ్చట.... మీకు గవర్నమెంటు నుండి వచ్చిన మాంచి జాగలల్ల క్వార్టర్లు ఉన్నాయ్....ఇంకా సొంత ఇండ్లేమో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లాంటి మంచి మంచి జాగలల్ల ఉండె.. మరి మా పరిస్థితి గట్ల లేదే... ఏదో స్లమ్ ఏరియాల ఉంటుంటే కిటికీలు తెర్వకుంటనే ఫుళ్లు దోమలు ఇంక కిటికీ గిట్ల దెరిస్తివా..... బాధ భగవంతున్కే తెల్వాలే....అసలు మాలో సగం మందికి ఇండ్లే గతిలేవంటే కిటికీలు ఎట్ల దెర్వమంటవ్...
సేతుల్‌గాల్నంక ఆకులు పట్కునుడు గాదు గానీ...... గీ విద్యుత్ గురించైతె గిట్ల జేసిండ్రు సరే... అసలుకే వానల్ సరిగ్గ పడలేదు.. పంటలు గిట్ల 10లక్షల హెక్టార్లు వేయాల్సినవి 8ల.హెక్టార్లే ఏసిండ్రు.... ఏదో గోదాములళ్ల దాన్యాలున్నయిగన్కా ఏదో నడిసిపోతుంది... ఈడికే అన్నింటి ధరలు ఆకాసాన్నంటినయి ఇగ తిండిగింజల సప్లయి గిట్ల సరిగ్గా జూడకుంటే దళార్ల ధగాతో మా నోట్ల మట్టి గొట్టినట్టే... కరెంటు లేక... తిండిగింజలు లేక... చేస్తందుకు పనుల్లేక... పస్తుల బతుకులు జేయకుండ్రి ప్లీజ్‌జ్‌జ్‌జ్..... జర ముందుజాగ్రత్త పడుండ్రి..
సుందర్

No comments:
Post a Comment