అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 22, 2012

ఇంకెంతో దూరం లేదు....!!!!

దేశ అభివృద్ధి గురించిన నిర్ణయాలూ.. ప్రజా ప్రయోజనాలకోసం నీతివంతమైన నిర్ణయాలు తీసుకుంటే సిబిఐ ప్రశ్నిస్తుందా..?? లేక ప్రజా ధనాన్ని అక్రమంగా తమ బ్యాంకు బాలెన్సుల్లోకి మళ్లిస్తే ప్రశ్నిస్తుందా..?? అసలు సిబిఐ ప్రశ్నిస్తుంది అంటే మంత్రులకు ఎందుకంత భయం...??? నిజ్జంగా ఏ పాపం తెలియని వారు.... ప్రజా శ్రేయస్సుకై అహర్నిశలూ శ్రమిస్తూ.. ప్రజలకోసం బతికేవారు ఒకరు అవినీతి ఆరోపణలు చేస్తే భయపడతారా...??? ఈ ప్రశ్నలు బేతాళమాంత్రికుడు భట్టివిక్రమార్కునికి వేస్తే తప్పకుండా అతని తల  వేయి ముక్కలవుతుంది ఎందుకంటారా..... తెలిసినా చెప్పకపోతే.... లేదా తెలిసి అబద్ధం చెబితే వారి రూల్స్‌ ప్రకారం జరిగేది అదే కదా...
ఒక వేల తెలసి తెలిసి నిజం చెబుదామా అంటే.. దేశంలోని ఒక అత్యున్నత సంస్థ సిబిఐ చెబితేనే మంత్రులు సిబిఐపై గుర్రుమంటూ లేస్తున్నారు చాన్సు దొరికితే చావుదెబ్బతీద్దామని చూస్తునారు. ఇక విక్రమార్కుడు చెప్పాడా చంపి వేయిముక్కలుకాదు లక్షముక్కలు చేస్తారు. తెలియదని చెప్పినా జరిగేది అదే కదా...!! కాకపోతే వేయి బెటరా అక్షబెటరా అనే అవకాశం మాత్రమే మన విక్రమార్కునికి మిగిలి ఉంది.
మంత్రులు తమ స్వార్థంకోసం.... చట్టవ్యతిరేకంగా..మరియు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తమ స్వంత ఖజానాల్లోకి ప్రజా ధనాన్ని మరల్చుకున్నారన్నదీ...., ప్రభుత్వ ఆస్తులను... భూములనూ.. టెండర్లనూ.. తమ అనుయాయులకు అప్పనంగా అప్పజెప్పారన్నదీ జగమెరిగిన సత్యం.
ఏ విశయంలో ఏకాభిప్రాయానికిరాని మంత్రులు, అవినీతిపై సిబిఐ ప్రశ్నిస్తుందనగానే... ఏకంగా 22 మంది (మంత్రులు) ఏకమై ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారంటే...??? బుడంకాయలదొంగ శాస్త్రం గుర్తుకురాక మానదు.
దొరికితేనే దొంగ, దొరికేదాకా నేను నిస్వార్థపరున్నీ.... నిస్వార్థపరున్నీ... అంటూ బ్యాండు వాయించుకుంటారు.. ఇంతలా మొత్తుకుంటుంటే వినేవాళ్ళకూ.. అయ్యో పాపం నిజమే కావచ్చునని అనుమానం వచ్చేంతలా ఉంటుంది మనవాళ్ల నటవిశ్వరూపం. తీరా ఆధారాలతో సహా రుజువైన తర్వాత చెరసాల చువ్వలు లెక్కపెట్టక తప్పదు.
మంత్రులు ఒకరి తర్వాత ఒకరు.... ఒకరి తర్వాత ఒకరు జైలుపాలవుతున్నారు. ఒక వ్యాఖ్యాత అన్నట్లు ఇక కేబినెట్‌ సమావేశాలు చంచల్‌గూడజైల్లో జరుపుకోవచ్చు అన్న మాట నిజం కావడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తుంది.

 
సుందర్

1 comment:

  1. కాంగ్రెస్ సారాభట్టి విక్రమార్క వ్న్నారు కదా, ఆయనే సమాధానం చెబుతాడు. సి.బి.ఐ తలే పగులుద్ది.

    ReplyDelete