అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, July 8, 2012

మేం శ్రామికులం.... శ్రమే మా కులం..!!!

మేం శ్రామికులం....
శ్రమే మా కులం..!!
చాకిరే మా బతుకుదెరువు..
ఫలితం ఆ దేవుడెరుగు..!!
వచ్చేఅరకొర కూలితో...

కలో.. గంజో.. తాగుతాం..!!
కష్టాల కాష్టంలున్నా...
కష్టాన్నే నమ్ముకున్నాం...!!

రక్తపు బొట్టు కరిగించి....
చెమటచుక్క చిందిస్తాం..!!
బాధలకదరం బెధరం....
అవమానం... సహించం..!!

అన్యాయాన్నెదిరిస్తాం...
ఆఖరి ఊపిరివరకూ....!!
- సుందర్

No comments:

Post a Comment