ఈ రోజు (6/4/11) నేను ఇంటర్ చదివిన ఇబ్రహింపట్నం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ మాది 2006-07 బ్యాచ్ అంటే ఇప్పటికీ కరెక్టుగా ఐదు సంవత్సరాలు... చాలా రోజుల తర్వాత హాస్టల్‌కి వెళ్లడంతో అక్కడ అంతా కొత్త వాళ్లు కనిపిస్తున్నారు. లెక్చరర్లు అంతా మారారు. అప్పుడు నేను రోజు పొద్దున్నే లేచి మొదటగా అడుగుపెట్టే బాస్కెట్ బాల్ గ్రౌండ్‌లో నేను నా టీం మ్యాచ్ ఆడుతున్న జ్ఞాపకాలు మెదలాడుతున్నాయి. నేను రోజూ ఆడిన, గెంతిన, కూర్చున్న, పడుకున్న ప్రదేశాలు ఇప్పుడు నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు నాతో పాటూ కూర్చునే ఫ్రెండ్స్ అక్కడ లేరు. నేను అనుకున్నా,........ అంతా కొత్త వాళ్లు వచ్చారని... కానీ కొద్దిసేపటికి ఒక సార్ ( ఎవరో తెలియదు ) ఎవరు బాబు నువ్వు ఏంకావాలి అన్నాడు... అప్పుడు అర్థమైంది వాళ్లు కొత్త వాళ్లు కాదు ఐదు సంవత్సరాల నుంచి ( అంటే నేను వెళ్లిపోగానే వాళ్లు వచ్చారు) వాళ్లు అక్కడుంటున్నారు . నేనే కొత్త వాణ్ణననే విషయం చాలా లేట్ గా అర్థం చేసుకున్నాను... నా క్లాస్‌రూం.... నా బాస్కెట్‌బాల్ గ్రౌండ్... నా డార్మెట్రీ (రూం) నా అనుకున్నవి అన్నీ ఇప్పుడు వేరే వాళ్లవి. కాని విశేషమేమిటంటే... అప్పుడు నేను సెకండ్ ఇయర్‌లో అందరితో పరిచయాలు బాగా మెంయింటెయిన్ చేసేవాణ్ణి. అదే ఈ రోజు నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటారా.... ఇప్పుటి పదవతరగతి విద్యార్థులు అప్పుడు 6వ తరగతిలోకి కొత్తగా వచ్చారు. అప్పుడు వాళ్లకు బాస్కెట్ బాల్ నేర్పించడం. ఈవినింగ్ పొడుపు కథలతో ఆడించడంలాంటివి చేసే వాణ్ణి అందుకే చాలా మంది. వచ్చి బాగున్నావా శ్రీనన్నా అని పేరు పెట్టి పలకరించారు. కానీ నాకు వాళ్ల పేర్లు గుర్తులేవు.. బాగున్నా తమ్ముళ్లూ ఎలా చదువుతున్నారు. అంటూ.. మాటల్లోకి దింపి వాళ్ల పేర్లను మళ్లీ వాళ్లకు తెలియకుండానే కనుకున్నేందుకు ట్రై చేసా కొద్ది వరకు సక్సెస్ అయ్యా.... చివరగా వెళ్తూ వెళ్తూ..... పిఇటి సర్‌ని కలుసుకుంటూ.. వెళ్లాను అతను మాత్రం అప్పుడు ఎలా రిసీవ్ చేసుకునే వాడో ఇప్పుడూ అలాగే బాగున్నావా బేటా... ఇప్పుడు ఏం చేస్తున్నావు... అంటూ ఆప్యాయంగా పలకరించాడు... అంతకంటే ఇంకేం కావాలి... మా సార్లు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో... అనుకుంటూ.... మళ్లీ హైదరాబాద్‌కు బయలుదేరాను......
సుందర్
సుందర్
No comments:
Post a Comment