అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, June 16, 2011

అనంతగిరి అడవుల్లో ఆరోజు....

నేను మా ఫ్రెండ్స్‌ శ్రీకాంత్‌, పవన్‌, మధు, అమర్‌, రాజు ఒక షార్ట్‌ ఫిలిం తీసేందుకు అనంతగిరి  వెళ్లాము.. అక్కడ అడవి చాలా పెద్దగా ఉంటుందని మేము తీసే ఫిల్మ్‌కి ఆ ప్లేసే కరెక్టని మార్నింగ్ ‌ ఐదుగంటలకు విద్యానగర్‌లో ట్రైన్‌ ఎక్కాము. నేను ట్రైన్‌ ఎక్కడం అదే ఫస్ట్‌ టైం అంతవరకూ ఎప్పుడూ ట్రైన్‌ ఎక్కలేదు.. కారణం నా స్టడీ హైదరాబాద్‌లో అవడం.. మళ్లీ మా ఊరుకూడా హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం.. ఏమైతేనేం.. ట్రైన్‌లో ఎలా ఉంటుందో.. అనుకున్న మురిపెం కాస్తా తీరింది. చాలా ఉత్సాహంగా అనంతగిరి చేరాం.. అక్కడ గుడి ఉంది ... ఆ గుండంలో స్నానం చేసి.. ఇక కొద్దిగా ఫారెస్ట్‌లోకి వెళ్లాము.. ఎలా ఉంటుందో అనుకుంటే స్టార్టింగే చాలా దట్టంగా ఉంది. మేము తీసే షార్ట్‌ ఫిలిం హరర్‌కు సంబంధించింది కనుక అక్కడ కొద్దిగా లోనికి వెళ్లి. మాంచి స్పాట్‌ పట్టుకున్నాం.. అక్కడే రెడీ... ఇంకా చాలా తెలుగు సినిమాలు కూడా తీసారంట... కొద్దిగా లోనికి వెలితే ... గుట్టలు పుట్టలు.. ఎత్తులు పల్లాలు దాటి ఒక దట్టమైన ప్రదేశంలోనికి వెళ్లాము.. అక్కడ స్ఫాట్‌ అనుకుని ఒక రెండు మూడు గంటల్లో షాట్స్‌.. తీసేసాం.. ఎలా వస్తుందో అనుకున్నాం.. కానీ చాలా బాగా వచ్చింది. అక్కడ ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మా ముందున వెళ్తున్న పవన్‌ సడెన్‌గా జారిపోయాడు. కాని ‌ మేము అతన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆరోజు చాలా ఉత్సాహంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని మా ఫ్రెండ్‌ వాళ్ల ఇంటికి వెళ్లాం వాళ్ల అమ్మానాన్న  చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు.మళ్లీ ఈవినింగ్‌ డ్యూటీ ఉంది కాబట్టి 7 గంటలలోపు హైదరాబాద్‌ వచ్చేసాం.. అంతసేపు అడవి మొత్తం తిరిగి అలసిపోయిన మేము అనంతగిరిలో ట్రైన్‌ ఎక్కితే డైరెక్టు హైెదరాబాద్‌ వచ్చే వరకూ మెలుకువ రాలేదంటే.. అర్థం చేసుకోవచ్చు మేము ఏ రేంజ్‌లో అలసి పోయామో..

సుందర్

No comments:

Post a Comment