సమాజంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే చాలా వింతగా అనిపిస్తాయి. కొన్ని వందల కోట్ల ప్రజా ధనాన్ని కొళ్లగొట్టిన ఘరానా రాజకీయ నాయకులు తమ పదవులకోసం/ పదవులు కాపాడుకోవడంకోసం.. అవినీతితో సంపాధించిన అక్రమా సంపాదనను దాచిపెట్టుకోవడానికి నిత్యం మనశ్శాంతి లేకుండా ప్రాకులాడుతుంటే.. సామాన్య జనం మాత్రం తాము చేసే వృత్తే దైవంగా.. భావిస్తారు. చిన్నమొత్తమైనా వచ్చిన కష్టార్జితాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఈ ధనవంతులూ.. సామాన్యుల మధ్య అంతరరాన్ని గమనిస్తేచాలా చిత్రంగా తోస్తుంది.
విషయానికి వస్తే...
మా రూం పక్కన ఒక చెప్పులు కుట్టుకునే ముదుసలి జంట వుంటుంది. వారు ఉదయం 8గంటల నుండి నుండి రాత్రి 8 గంటలదాకా అక్కడే ఉంటూ చెప్పులు కుట్టుకుంటారు. వచ్చిన చిన్నమొత్తమైనా చాలా సంతోషంగా స్వీకరిస్తారు. వారి పనిముట్లను దైవంగా భావిస్తారు. పొరపాటున జారిపోయినా... కాళ్లు తాకినా... కంగారుపడతారు ఏదో పేద్ద తప్పు చేసినట్లు బాధపడుతారు..చాలా పవిత్రంగా పూజిస్తారు.
నేను వాళ్ల దగ్గర చెప్పులు కుట్టిద్దామని వెళ్లా.. జత చెప్పులు కుట్టడానికి ఎంత అవుతుంది తాతా అని అడిగా.. 35 రూపాయలవుతుంది. బాబూ.. అన్నాడు.. ఆ ముసలాయన... ఆ... ముప్పై ఐదు కాదు కానీ.. 25 ఇస్తా తీసుకో అన్నాను..... నీ ఇష్టం బాబు...... అన్నాడు... వారు చెరో చెప్పూ తీసుకుని కుడుతున్నారు.... ఒక పవిత్ర యజ్ఞంలాగా చాలా ఒడుపుగా జాగ్రత్తగా కుడుతున్నారు... పొరపాటున ఆ ముసలావిడ చేతిలో సూది (చెప్పులు కుట్టేది) జారిపోయి కింద పడింది. ఆవిడ ఎంతో ఘోర తప్పిదం జరిగినట్లు కంగారు పడుతూ... ఒకటికి నాలుగు సార్లు మొక్కుతోంది... వారికి వృత్తిపట్ల, వారి పనిముట్ల పట్ల వున్న గౌరవం చూసి.... వారికి "ఫిదా" అయిపోయాను.... అరే...! మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం.. ఇలా కష్ట పడేవారి దగ్గర బేరాలు ఆడటం తప్పు అనిపించింది. నలబై రూపాయలు తీసి ఆ తాత చేతిలో పెట్టి చేంజ్ అడక్కుండా.... వెళ్తున్నా... వారిలో కంగారూ... అరె ఎక్కువ డబ్బులు ఇచ్చావు బాబు చిల్లర తీసుకో అంటున్నారు... ఉంచు తాతా అంటూ ఏదో సాధించినట్టు.... తెలియని ఆనందంతో రూం దారి పట్టాను....

No comments:
Post a Comment