ఆ మధ్యన నాకు ప్రతి రోజూ.. ఉదయం కరెక్టుగా 9 - 10 గం//ల మధ్యన ఒక మెస్సేజ్ వచ్చేది. అది మార్కెట్ రేట్లకు సంబంధించిన మెసేజ్. ఎప్పుడూ ఆ మెసేజ్ రాగానే వీళ్లకేమీ పనిలేదారా బాబూ.. అనుకుంటూ తిట్టుకునేవాణ్ని.. కానీ ఒక రోజు ఆ మెసేజే మేలు చేసింది. ఆ రోజు మా ఫస్ట్ ఇంటర్నల్స్ సెకండ్ డే. ముందు రోజు ఇంటర్నల్స్ బాగా రాసాను. ఆ రోజు కూడా బాగా రాయాలని రాత్రి 2.30 వరకూ చదువుకుని పడుకున్నాను. 6 గంటలకు అలారం పెట్టుకున్నాను. టైంకు అలారం మోగింది కానీ మనం లేస్తామా... ఎందుకు లేస్తాం.. ఎక్జాం 10 గంటలకు ఉంది కదా ఒక పదిహేను నిమిషాలు పడుకుందామని పడుకున్నా. నిద్ర పట్టేసింది. రూంలో అందరూ నైట్ సినిమాకు వెళ్లి వచ్చారు కాబట్టి ఎవ్వరూ అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే మెస్సేజ్ టోన్ వినిపించింది 'జయహో...జయహో.... అంటూ..' చిరాగ్గాలేచి మెస్సేజ్ చూసాను వీడబ్బ... అని రెండు బూతులేసుకున్నా... తీరా టైం చూస్తే 9 అవుతుంది. అయ్యబాబోయ్ ఎంత టైం అయ్యింది. ఈ మెస్సేజ్ రాకుంటే నేనలాగే పడుకనేవాణ్ణి కదా అనుకుంటూ మెసేజ్ పంపినోడు దేవుడురా బాబూ.. అనుకుంటూ... తొందర తొందరగా ఫ్రెష్ అఫ్ అయి కాలేజీకి వెళ్లి పరీక్షకు అందుకున్నాను..
Very interesting
ReplyDeleteEverything happens for a reason..
ReplyDelete