చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్లాలనే ఆలోచన రాగానే మనసంతా ఉత్సాహంగా ఉంది. దాంతో నైటంతా నిద్రపోలేదు... నైట్ డ్యూటీ అవగానే మార్నింగ్‌దాకా ఆఫీస్‌లోనే ఉండి. ఆరుగంటలకు రూంకు వెళ్లగానే.. మా రూంమేట్ శ్రీను టిప్పిన్ రెడీ చేసాడు. ఫ్రెష్ అఫ్ అయి బస్‌లో బయలు దేరి ఊరికి వెళ్లే సరికి 10 అయింది. వెళ్లగానే మా వాళ్లంతా ఎప్పుడొచ్చావ్ సుందర్, ఎలా ఉన్నావురా.. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు. ఒకటే ప్రశ్నలు... అందరికి కుశల సమాదానాలు చెప్పి... ఇంటికి వెళ్లగానే మా పొట్టిది (అన్న కూతురు) బాబాయ్ అనుకుంటూ వచ్చి చంకనెక్కి కూర్చుంది. చాలా సేపు ఇంటిదగ్గరే గడిపి. అలా బయటికి వెళ్లగానే పక్క ఊరి వారితో క్రికెట్.. ఒకటే ఎంజాయ్ మూడు టీంలు వచ్చాయి. ట్రైయాంగిల్ సిరీస్ ఆడాము గ్రౌండ్ అంతా గోళగోళ చేసాము. ఎర్రటెండలో సైతం చాలా అరుస్తూ కేకలు పెడుతూ.. ఎదుటి జట్టు జాన్ కరాబ్ జేసినం... మ్యాచ్ అయిపోయి తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్తూ.. పక్కనున్న మామిడి తోట పని పట్టాము.. మంచి మంచి దోర మామిడికాయలు తెంపుకుని తినుకుంటూ ఊళ్లోకి వెళ్లాం.. ఇక సాయంత్రం మిత్రులతో బాతాఖానీ టైమే తెలియలేదు. 10.30 అయినా మా మాటలు అయిపోలేదు. తర్వాత ఎవ్వరింటికి వాళ్లు వెళ్లి. పడుకున్నాము. మళ్లీ మార్నింగ్ లేవగానే క్రికెట్. సాయంత్రం వరకూ... క్రికెటే క్రికెటు.. ఆకలి గుర్తుకు రాదు... ఎర్రటి ఎండను సైతం లక్ష పెట్టకుండా... ఆడుతుంటే ఏం పనిలేదా వీళ్లకి ''ఓ వరల్డుకప్పు తెచ్చేవాళ్లకంటే ఎక్కువ ఆడుతున్నారు''.. అంటూ కామెంటు చేసేవాళ్లు లేకపోలేదు. ఇక నైట్ 11.30 వరకూ ఐపిఎల్ విందు.. తర్వాత వాకిట్లో చాప వేసి నక్షత్రాలను చూసుకుంటూ... మాట్లాడుకుంటూ పొడుపు కథలు వేసుకుంటూ.. సినిమా స్టోరీలు చెప్పుకుంటూ.. పడుకునే సరికి 1 అయింది. మళ్లీ ఎర్లీ మార్నింగ్ 10కి లేవడం.. ( మా దృష్టిలో 10 ఎర్లీ మార్నింగ్ లెండి) ఫ్రెష్ అప్ అయి ఫ్రెండ్స్ తో మళ్లీ గ్రౌండ్‌కి వెళ్లి సామధ్యాహ్నం వరకూ క్రికెట్ ఆడి. సాయంత్రం నాలుగంటలకు సిటీకి రావాడం ఇష్టం లేకున్నా తప్పదన్నట్లు బారంగా బస్ ఎక్కి కూర్చున్నా.. మూడు రోజులు ఎండలో తిరిగి బాగా అలసిపోవడంతో నిద్ర పట్టేసింది. కళ్లు తెరిచి చూసే దిగాల్సిన స్టేషను వచ్చింది. ఈ రోజు నుంచీ మళ్లీ ఆఫీసు, కాలేజీ.. అంతా బిజీ బిజీ బతుకు....
సుందర్
No comments:
Post a Comment