అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, April 29, 2011

అన్నింటా అబివృద్ది సాదిస్తున్నా... అమ్మాయిల పై ఎందుకీ వివక్ష.. ?

పదవతరగతి ఫలితాల్లో... బాలికలదే.. హవా...
ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బాలికలే ముందంజ
రెండో సంవత్సరంలోనూ.. బాలికలదే పైచేయి..
ఈ రిజల్ట్స్‌లోనే కాదు..

జగతిలో సగభాగం సృష్టికి మూలం....స్త్రీ. సమాజ పరిణామంలో కీలక పాత్రం పోషిస్తున్నది స్త్రీమూర్తులే అయినా నేటికీ అమ్మాయిల మీద ఒక వివక్ష కొనసాగుతోంది. అబ్బాయి పుట్టాడంటే... అంగరంగ వైభంవంగా సంబరాలు జరిపే తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందనగానే ఒకింత నిరాశకు గురవుతున్నారు. దీనికి కారణం మనసులోతుల్లో బలంగా నాటుకుపోయిన ఒక దురభిప్రాయం.పుత్రుడు  పున్నామ నరకం నుండి కాపాడుతాడంట.. కూతురుదేముంది రా ఒకరింటికి ఇస్తే పోతుంది. అదే కొడుకు వంశోద్ధారకుడవుతాడు.. ఇవి సర్వసాధారణంగా వినిపించే మాటలు..
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు. విద్య, వైద్య, పాలన వ్యవస్థ, శాస్త్ర సాంకేతి రంగాల్లోనూ అబ్బాయిలతో పోటీ పడీ గెలుపొందున్నారు. ఇంత అభివృద్ధి సాధించినా మారుమూల పల్లెల్లో అమ్మాయిలను పురిటిలోనే చంపేస్తున్నారు. అంతెందుకు రాష్ట్ర రాజదానికి కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొన్ని పల్లెల్లో పుట్టిన ఆడ శిశువులను అమ్ముకొంటున్న వైనం ఇంకా కనబడుతూనే ఉంది.
మూడ విశ్వాసాలు విడనాడాలి. పుత్రుడు పున్నామనరకం నుంచి కాపాడుతాడో లేదో కానీ అమ్మాయిలను ప్రోత్సహిస్తే.. అమ్మానాన్నలకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. ఈ విషయంపై నిరక్షరాస్యుల్లో అవగాహన కలిగించాలి. 
.


సుందర్

No comments:

Post a Comment