అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, November 24, 2011

ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్‌....

రూపాయి విలువ ఎందుకు తగ్గాలి..?
రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతోంది...
రూపాయితో పోలీస్తే డాలర్‌ విలువ 52 రూపాయలు దాటింది....
అంటే మన దగ్గర ఉన్న రూపాయి విలువ రూపాయి కాదు సుమారు 35 పైసలన్నమాట....
మన రూపాయి విలువ ఎందుకు తగ్గాలి.....?
డాలర్‌ విలువ ఎందుకు పెరగాలి....?  అని ప్రశ్నిస్తే...... మన దిగుమతులు ఎక్కువౌతున్నాయి. ఎగుమతులు తగ్గుతున్నాయి. ఎగుమతులు పెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది. అని ఎక్కడో చదివాను... అసలు ఎగుమతి దిగుమతి సంబంధం లేకుండా... మన రూపాయికి మనమే... స్వీయ నియంత్రణ ఎందుకు పెట్టుకోకూడదు...? ఎవడొద్దంటాడు... మనము విదేశాలనుంచీ... విదేశీ బ్యాంకుల నుండి అప్పు ఎందుకు తెచ్చుకోవాలి....? ప్రభుత్వ నియంత్రణతో మన రిజర్వు బ్యాంకే అవసరమున్నంత డబ్బు  తయారు చేయొచ్చు కదా....? దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే రూల్స్‌ మనం ఎందుకు పాటించాలి... ఈ ప్రశ్నలు నన్ను ఎప్పట్నుండో వేధిస్తున్నాయి.. దయ చేసి ఎవరికైనా సమాధాన తెలిస్తే చెప్పండి ప్లీజ్‌....
సుందర్

No comments:

Post a Comment