అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, May 8, 2011

కొన్ని సార్లు అలా జరుగుతుంది...ఏం జేస్తం..!!

నేను నిజాంకాలేజీ డిగ్రీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నప్పటి సంఘటన  ఆరోజు సెమిష్టరు పరీక్ష నైటంతా చదివాను మార్నింగ్‌ 5.30 బస్‌కు బయలు దేరితేనే మళ్లీ కాలేజీ దగ్గర గంటో అరగంటో చదవచ్చని మార్నింగ్‌ లేచాను శీతాకాలం కావడం వల్ల చలి విపరీతంగా ఉంది అయినా సరే తప్పదుకదా.. అని స్నానం చేసాను. అమ్మ అప్పుడే నాకోసం అన్నం వండింది. వేడివేడిగా తిందామనుకోగానే బస్‌ హారన్‌ వినిపించింది. మా ఇంటిని నుండి బస్‌ స్టాండ్‌ చాలా దూరమే ఉంటుంది. ఇక అన్నం పక్కనెట్టి రన్నింగ్‌ మొదలెట్టాను చివరి క్షణంలో బస్‌ అందుకున్నాను. అప్పుడే ఎందుకో తల నొప్పిగా అనిపిస్తోంది.  ఏమైందబ్బా నైట్‌ నిద్ర పోనందుకు అనుకుని బస్‌లో ఒక అరగంట కునుకు తీద్దామని పడుకున్నా.. తీరా లేచి చూస్తే లాస్ట్‌ (ఎంజిబిఎస్‌) స్టాప్‌ వచ్చింది. కండక్టర్‌ దిగండి దిగండి  నైటంతా ఏం చేస్తారయ్యా బస్సులో పడుకుంటారు. అంటున్నాడు లేద్దామని కళ్లు తెరిచాను తల  బాగా తిరుగుతున్నట్లయ్యింది. బస్‌లో లేచి నిల్చున్నాను. కళ్లు తిరుగుతున్నాయి. ఏచేయాలబ్బా... అనుకుంటూ.. ఒక్కో అడుగు వేస్తుంటే ఎక్కడ కిందపడుతానో అనేంత అలసటతోనే దిగాను మళ్లీ అక్కడ నుండి నిజాం కాలేజీకి మరో బస్‌ ఎక్కాలి. అప్పుడే అటునుంచి బస్‌ పోతోంది. ఎక్కడినుంచి వచ్చిందో శక్తి రన్నింగ్‌ చేశాను. రన్నింగ్‌లో బస్‌ ఎక్కే క్రమంలో బస్‌ పుట్‌ బోర్డు మీద అడుగుపెట్టగానే చేయి జారిపోయింది. నా పని అయింపోయిందనుకున్నా అప్పుడే పుట్‌ బోర్డు చేస్తున్న కుర్రాడు నన్ను పట్టుకుని లోనికి పంపాడు. మళ్లీ కాలేజీ దగ్గర ఎలా దిగానో కాలేజీలోకి ఎలా వెళ్ళానో తెలియనంతగా జ్వరం పట్టేసింది..  ఎక్జాం టైం దగ్గర పడుతోంది. అప్పుడే మా ఫ్రెండ్‌ (గిరీష్‌) వచ్చి ఏమైంది. శ్రీను డల్‌గా ఉన్నావంటూ... పట్టుకున్నాడు. చాలా వేడిగా ఉన్నావు జ్వరం వచ్చిందా.. మరి ఇప్పుడు ఎక్జాం ఎలా రాస్తావు అని.. పక్కనున్న  హో టల్‌కు తీసుకెళ్లాడు. వేడివేడి చాయ్ తాగగానే కొద్దిగా నీరసం  తగ్గినట్లనిపించింది.  అయినా బాగా  తల నొప్పిగా ఉంది. ఎక్జాం బెల్‌ కొట్టారు సెంటర్‌లోకి వెళ్లి ఏం రాసి వచ్చానో  తెలీదు. పరీక్షలన్నీ జ్వరంతో బాధపడుతూనే రాశా. అదేం జ్వరమో పరీక్షలు అయిపోయిన తెల్లారే తగ్గిపోయింది. . గీ పరీక్షలకోసం పొద్దుపొద్దున్న ఆ స్నానం ఎందుకు జేస్తీ.. నెత్తి సరిగ్గా తుడుచుకోకుండా బస్‌ ఎందుకు ఎక్కితి. దీన్‌ తల్లి గీ జ్వరం ఎక్జాములైనదాక ఎందుకు తగ్గపాయే. అని తిట్టుకున్నా కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత.

సుందర్

No comments:

Post a Comment