అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, May 7, 2011

భవిష్యత్.. పద్మవ్యూహంలో అడుగిడుతున్నా...!

చదువులమ్మ  గర్భం నుండి
ఇపుడిపుడే   బయటికొచ్చిన పురిటి బిడ్డను..
మనుషుల మనసులలో లోతులు
చూపించే కళ్ళు లేవు...
పోటీని తట్టుకుని....
ముందుకురికే కాళ్ళు రాలే...
నేనే అబినవ అభిమాన్యును...
తల్లి కడులోనుండే... 
నేర్చిన నీతులు ఎన్నో..
తలరాతను మార్చగలిగే...
రాతల, ఊసులెన్నో 
తెలియకనే నేర్చుకున్న...
తావీద్ మహిమలు ఎన్నో..
ఇన్ని నా చెంతనున్న..
తప్పటడుగులు వేస్తూ..
పడుతూ... లేస్తూ....
బతుకు నడక నేరుస్తూ...
భవిష్యత్.. పద్మవ్యూహంలో అడుగిడుతున్నా...
ఆటంకాలెన్నొచ్చినా..
సైందవులెందరెదురొచ్చిన..
ముందుకురికే ధైర్యముంది.... 
తెగువ చూపే సత్తువుంది....
ఎన్నున్నా  ఏమున్నా...
బలి అయ్యే క్షణమే వస్తే....
కలమే బ్రహ్మాస్త్రంగా...
బలమై నా వెంటుండి...
గెలిపించి నిలబెట్టే..
చదువే.. నా రక్షణ.
అందుకనే వెనుదిరగక
మున్ముందుకు వెళ్తున్నా..
ఎంత దూరమెంత కాలమన్నది..
భవిష్యత్తే నిర్ణయిస్తుంది...!

సుందర్

No comments:

Post a Comment