అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, August 22, 2010

డగ్స్‌ వినియోగంపై టాలీవుడ్‌లో కదులుతున్న డొంక

21 ఫోన్‌ నెంబర్లు బయటకు  పొక్కిన వైనం
రాజకీయ రంగు పులుముకున్న  డ్రగ్స్‌ వ్యవహారం
మీడియా మెట్లెక్కిన సినీ హీరోలు


డ్రగ్స్‌ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన నైజీరియన్‌ దేశస్తుడు చిమా క్లెమెంట్‌ ఫేస్‌ బుక్‌ నుండి పోలీసులు సేకరించిన ఫోన్‌ నెంబర్ల చిట్టా శనివారం అనూహ్యంగా బయటకు పొక్కింది. దీంతో టాలీవుడ్‌తోపాటు రాజకీయ నాయకుల్లో కలకలం రేగింది. ఫోన్‌ నెంబర్లు ఎలా బయటకు వచ్చాయో తమకు తెలియదని పశ్చిమ మండలం డిసిపి స్టీఫెన్‌ రవీంద్ర తెలుపుతున్నారు. అయినప్పటికీ డ్రగ్స్‌ను కట్టడి చేయడంలో భాగంగా పోలీసులే కిందిస్థాయి సిబ్బందితో వ్యూహాత్మకంగా బయటకు పొక్కే విధంగా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నాలుగు గ్యాంగులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఇప్పటి వరకు సుమారు 200 మంది విఐపిల ఫోన్‌ నెంబర్లను సేకరించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారి ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఒక్క క్లెమెంట్‌ దగ్గర నుండి 21 ఫోన్‌ నెంబర్లు సేకరించారు. వీరిలో టాలీవుడ్‌ హీరోలు రాజా, 'అష్టాచెమ్మా' చిత్రం హీరో నాని పేర్లతోపాటు హీరోయిన్లు త్రిష, సైరాభాను, ఎంపి హర్షకుమార్‌ కుమారునితోపాటు పలువురి ఫోన్‌ నెంబర్లు ఉన్నట్లు తేలింది. దీంతో టాలీవుడ్‌ హీరోలు మీడియా ముందుకు వచ్చారు. డ్రగ్స్‌ ఎలా ఉంటాయో తమకు తెలియదని, తాము పబ్‌లకు వెళ్లమని తెలిపారు. రాజకీయ నాయకులు స్పందించి తమ బిడ్డలకు డ్రగ్స్‌ వాడకానికి ఎలాంటి సంబంధమూ లేదని, క్లెమెంట్‌ వద్ద తమ బిడ్డల ఫోన్‌ నెంబర్లు ఎలా ఉన్నాయో ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. విఐపిల ఫోన్‌ నెంబర్లను సేకరించడం పెద్ద ఇబ్బందేమీ కాదని అన్నారు. కుర్ర హీరోలు, రాజకీయ నాయకుల కుమారులు పబ్‌లకు వెళ్లిన సమయంలో విదేశీయులు పరిచయం చేసుకొని ఫోన్‌ నెంబర్లు తీసుకునే అవకాశాలున్నాయని తెలిపారు. కొన్ని 44లో
నెంబర్లకు సంబంధించి తప్పుడు అడ్రస్‌లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. టాలీవుడ్‌కు చెందిన మరి కొందరు కల్పించుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరో కొంత మంది డ్రగ్స్‌ వాడినంత మాత్రాన అందరినీ ఒకేగాటన కట్టడం మంచి సంస్కృతి కాదన్నారు. టిడిపి నాయకులు ఎర్రంనాయుడు ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసు కమిషనర్‌ ప్రకటించిన 60 మంది పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వద్ద ఉన్న లిస్టులో మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో డ్రగ్స్‌ వ్యవహారం అటు ఇటు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. పోలీసులు మాత్రం తమ వద్ద ఉన్న నెంబర్ల ఆధారంగా డ్రగ్స్‌ను వినియోగిస్తున్న వారితోపాటు విక్రయిస్తున్న వారి వివరాలను గోప్యంగా సేకరిస్తుండటంతో డ్రగ్స్‌ వినియోగదారుల్లో కలవరం మొదలైంది.
ఫోన్‌ నెంబర్ల లీక్‌ వ్యూహాత్మకమే...
పోలీసులు కూడా డ్రగ్స్‌ అమ్మకాలు, వాడకంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సోదరులను పట్టుకున్నట్లుగా, డ్రగ్స్‌ వాడుతున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే తప్పితే కేసులు కోర్టులో నిలబడవు. రవితేజ సోదరుల అరెస్ట్‌తో మిగతా వారు డ్రగ్స్‌ కొనేందుకు కొంత కాలంపాటు ముందుకు రారు. దీంతో అందరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం అసాధ్యమని పోలీసులకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రముఖులను నైజీరియాకు చెందిన క్లెమెంట్‌ వద్ద లభించిన ఫోన్‌ నెంబర్ల ఆధారంతో అరెస్ట్‌ చేయడం సాధ్యం కాదని తెలిసి కేవలం బెదిరింపులతో కొంత మేరకు కట్టడి చేయవచ్చనే ధోరిణిలో పోలీసులు ముందుకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ ఆలోచనతోనే ఫోన్‌ నెంబర్ల చిట్టాను బయటకు పొక్కే విధంగా చేసినట్లు సమాచారం. పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు వల్ల పబ్‌ కల్చర్‌ కొంతకాలం పాటు తగ్గే అవకాశం ఉంటుంది. పబ్‌లపై కూడా పోలీసులు నిఘా వేయడంతో డ్రగ్స్‌ అమ్మకాలకు కొంత కాలం బ్రేకు పడే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వీకెండ్‌ రోజుల్లో పబ్‌లు కలకలాడటం ఆనవాయితీ. ఈ రెండ్రోజుల్లో పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డిపిఎస్‌ చట్టం ప్రకారం డ్రగ్స్‌ విక్రయించే వారికి 15 నుండి 20 ఏళ్లు శిక్ష పడే అవకాశముందని, డ్రగ్స్‌ తీసుకున్న వారికి కేవలం ఆరు మాసాలు శిక్ష పడుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు శిక్షలను సైతం ప్రకటించడం డ్రగ్స్‌ వినియోగదారులను భయపెట్టించేందుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌ నగరంలో ఏ మేరకు పబ్‌ కల్చర్‌తోపాటు డ్రగ్స్‌ విక్రయం, కొనుగోళ్లను కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే.
ur's sri

No comments:

Post a Comment