అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, August 22, 2010

సిపిఎం సీనియర్‌ నాయకుని మృతి

యాచారం, ధర్మన్నగూడ : తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు కురువృద్ధుడు అనుమండ్ల నారయ్య(100) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం తన స్వగ్రామం యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో విప్లవ నినాదాల మధ్య ఘనంగా జరిగాయి. రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.జంగారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి, ఇ,పట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ్మ, వ్యకాస నాయకులు పి.అంజయ్య మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ఎం.శ్రీమన్నారాయణ నారయ్య మృతదేహంపై ఎర్రజెండా, పూలమాలలుంచి జోహర్లర్పించారు. ఈసందర్భంగా పి.జంగారెడ్డి మాట్లాడుతూ సిపిఎంకు నారాయ్య చేసిన సేవలు అజరామరమన్నారు.. తెలంగాణా సాయుధ పోరాటంలో ఉద్యమకారులు నారయ్యతో ఎంతో సహకరించారని ఆయన పేర్కోన్నారు. ధర్మన్నగూడ భూపోరాటంలో నారయ్య కీలక పాత్ర పోషించారన్నారు. నిలువనీడలేని పేదలకు భూపంపిణీ కోసం ఆయన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సమరశీలన్నారు. నారయ్య ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్తా ముందుకు నడువాలన్నారు.

రజకారులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన నారయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుంభిగించాలని ఇ.పట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ్మ పిలుపు నిచ్చారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఎర్రజెండాల మధ్య విప్లవ నినాదాలతో నారయ్య అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. 

ur's sri

1 comment: