అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, February 17, 2011

నా దిమాక్‌ కరాబ్‌జేసిన 'కెబ్లాస'

సానా రోజుల్నుంచి సూస్తున్న కెబ్లాస... కెబ్లాస అన్న పదం చదివిన  గాని  ఎందుకో సరిగ్గా పట్టించుకోలే. కానీ మొన్న ప్రమాదవనంలో ఒక పోస్టు ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తే సదివిన. సదువుత సదువుతా.... గీ కెబ్లాస అనే పదం మల్ల ఇంకోసారి సదివిన..! సదివినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. గాని ఇగ డ్యూటీ అయిపోయింది పొద్దుగాల్నే మా దోస్తు బండి మీద రూంకి పోతున్నా.... ఇగ గప్పుడే ఎందుకో తెల్వదు గానీ.. కెబ్లాస గుర్తొచ్చింది. అరె గీ కెబ్లాస ఏంది అనుకున్నా... గీ పదం ఏడనో ఇంటి గదా అనుకున్నా.. తర్వాత కొద్ది సేపట్కి యాద్కొచ్చింది, గీ పదం ఏడ ఇనలే ప్రమాదవనం బ్లాగులో సూసిన అని, సూస్తే సూసిన గానీ కెబ్లాస అంటే ఏందో అని ఇగ సోంచాయించుతున్నా.... ఎంతకూ యాద్కొస్తలేదు.... గట్లనే ఉదయం మూడు గంటలనుంచి రూంకి వెళ్లి మళ్లీ పండుకునె దాకా.. అంటే ఏడు గంటల దాకా... ఒకటే సోంచాయించిన. ఇగ గప్పుడు యాద్కిరాలే... తర్వాత నిద్ర లేసినంక తానం జేస్తుంటే మళ్లీ యాద్కి వచ్చింది. గప్పుడు గబ్బుక్కున గుర్తొచ్చింది. కెలుకుడు బ్లాగర్ల సంఘం అని. మరి గిది గిట్ల కరక్టా కాదా? అని సోంచాయించుతనే... ఉన్న లాస్ట్‌కి కరెక్టే అని డిసైడ్‌ అయ్యి గీ పోస్టు రాస్తున్న మళ్ల... ఏమంటర్.........
సుందర్

No comments:

Post a Comment