రేపు మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న ప్రపంచకప్ మొదటి మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటారా... ఒక సారి రీల్ వెనక్కి తిరగేయండి... పోయిన ప్రపంచకప్‌లో టీంఇండియా లీగ్‌దశలోనే ఇంటిదారి పట్టడానికి కారణం బంగ్లాదేశే... కాబట్టి కొంచెం అలసత్వం ప్రదర్శించినా... మ్యాచ్ ఎగరేసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు బంగ్లా పులి కూనలు... అందుకేనేమో అంతకుముందు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే ఏదో ప్రాక్టీసు మ్యాచ్ లాగా భావించే మన భారత జట్టు ఈ సారి సీరియస్‌గా తీసుకుని మొదటి మ్యాచ్‌లోనే అఖండ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అభేధ్యమై భారత బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఇది పెద్ద విషయమేమీ కాదని అనిపిస్తుంది. మొన్న న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌నే చూసుకుంటే సచిన్, సెహ్వాగ్ సరిగ్గా ఆడకుండానే స్కోరు 360 పరుగుల మార్కు దాటింది అంటే వారు కూడా బ్యాట్ జుటిపించారా....! ఇక ఎంతటి జట్టైనా మట్టికరవాల్సిందే..! సచిన్, సెహ్వాగ్ మాంచి ఆరంభాన్నందించి ఆ తర్వాత వచ్చే గంభీర్, యువీ, రైనా, కోహ్లీ, యూసుఫ్‌లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తే.. జహీర్ బల్లేబల్లే బజ్జీ వికెట్లతో గిల్లిగోన ఆడుకోవాలని కోరుకుంటూ........... ఆల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్ ల్‌ల్‌ల్ ది బెస్ట్ ఇండియా
సుందర్
No comments:
Post a Comment