బంద్... అనే పదం వినడానికి చాలా జోష్‌గా ఉంటుంది. కానీ దాని ద్వారా ప్రజానీకం ఎన్నెన్ని కష్టాలు అనుభవిస్తారో ఆ దేవుడికే తెలుసు. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కనిండని పేద ప్రజల ఈ బందులతో కనీస అవసరాలు తీర్చుకోలేని దుర్భర స్థితిని అనుభవిస్తుంటారు. బందురోజు ప్రయానికుల పాట్లు అన్నీ ఇన్ని కావు. బస్సులు నడవకపోవడంతో ఆటో ఛార్జీలు అమాంతంగా పెరిగిపోతాయాయి.రవాణా వ్యవస్త ఎక్కడికక్కడ స్తంభించి పోవడంతో నిత్యావసర వస్తువుల దరలకు అమాంతం రెక్కలు వస్తాయి. ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చుకుని ఎలాగోలా ఈ బందురోజులు వెల్లదీసినా... ఈ రోజు జరిగిన గొడవలలో ద్వంసం అయిన ప్రభుత్వ ఆస్తులు రికవరీ కావలంటే మళ్లీ సాదారణ ప్రజానీకం మీద పన్నుపోటు తప్పదు. ఇన్ని ఇబ్బందులున్న బందులతో లాభ పడేదెవరంటే కేవలం రాజకీయ పక్షాలు మాత్రమే అన్నది నగ్న సత్యం.
సుందర్
No comments:
Post a Comment