మన రాష్ట్ర బడ్జెట్ చూడ్డానికి చాలా  బ్రహ్మాండంగా కనిస్తుంది. లక్షకోట్ల బడ్జెట్ అంటూ ఓ... గొప్పలు  చెప్పుకుంటుంటారు. ఈ ఏడు 1,28,548 కోట్ల బడ్జెట్ వామ్మో ఎంత పే....ద్ద  బడ్జెట్... అనుకుంటాం.... కానీ పేపర్లో కేటాయింపులకు భౌతికంగా జరిగే  అభివృద్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత అంతరం ఉంటుంది ఎందుకో...?  లక్షకోట్ల  బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయానికి, పట్టణాభివృద్ధికి,  గ్రామీణాభివృద్ధికి, అంటూ కొంత మొత్తంలో కేటాయించారు. అదేవిదంగా మన రాజకీయ  నాయకుల స్విస్ అకౌంట్లోకి అంటూ కూడా కొంత మొత్తాన్ని కేటాయిస్తే...  ఈ  సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి జరుగుంతుందో ఖచ్చితంగా ఒక అంచనాకు రావచ్చు.  కానీ పరిస్థితి ఇప్పుడు ఆవిదంగా లేదు మన రాజకీయ నాయకుల ప్రస్తుత  ఆస్తిపాస్తుల విలువ ఎంత  మళ్లీ వచ్చే  బడ్జెట్ నాటికి ఎన్ని రెట్లు పెరింగింది అన్న   లెక్కలు వేసుకుంటే సరి ఖచ్చితమైన అభివృద్ధిని టక్కున కళ్లు మూసుకుని  చెప్పవచ్చు 'శూన్యం' అని. ఒక కుంబకోణం బయటపడగానే మన రాజకీయ నాయకులు మేము  సత్య హరిశ్చంద్రులం ఆ అవినీతిలో నాకు సంబందం ఉంది అని నిరూపిస్తే రాజకీయ  సన్యాసం చేస్తామంటూ మీడియా ముందు శపదాలు చేస్తారు. మరి..! అందరూ...  బ్రహ్మనులున్న వీదిలోకి వెళ్లిన కోడిపెట్ట మాత్రం మాయం అవుతోందంట....!  ఎందుకంటారూ.......   
 
 
 
No comments:
Post a Comment