ఎక్కువ ఇష్టమైనవాళ్లతోనే ఎక్కువగా పోట్లాడుతుంటాము అది ఏ రేంజ్‌లో అంటే చెప్పనలవి కాదు. అంత పోట్లాడినా మరుక్షణమే మాట్లాడటం ఆనవాయితీ... కానీ కొన్ని సార్లు ఎంతో ఇష్టమైన వాళ్లతో వచ్చిన చిన్న గొడవ పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు పంతాలు పట్టింపులకు పోయి మాట్లాడుకోవడం మానేసామనుకోండి. అది కొన్ని సంవత్సరాలపాటు అలానే సాగుతుంది. ఇద్దరి మనసుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనిపిస్తున్నా...? కానీ... ఇగో అడ్డం వచ్చి మాట్లాడుకోరు. ఇది ఏదో ఊహించి చెప్పుతున్నది కాదు నా జీవితంలో జరిగింది. కనుకనే చెబుతున్నా..
నేను నాలుగోతరగతి చదువుతున్నప్పుడు ప్రవీణ్ అనే మా ఫ్రెండ్‌తో చిన్న విషయం దగ్గర స్పర్థలు వచ్చి మట్లాడుకోవడం బంజేశాము. అది చాలా సిల్లీ పాయింట్. దాని గురించి మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఐదుసంవత్సరాలు ఉన్నామంటే... అర్థం చేసుకోవచ్చు. ఇద్దరికీ మాట్లాడుకోవాలని ఉన్నా "ఇగో" అడ్డు వచ్చేది కానీ అప్పట్లో తెల్వదు ఇదే "ఇగో" అని. కానీ మేము అన్ని ఆటల్లో మిగతా మిత్రులతో కలిసి ఆడినప్పటికీ మాట్లాడుకునే వారము కాదు. చివరికి తను పదవ తరగతికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాము. ఐదేళ్ల తర్వాత మాట్లాడుకున్న మేము నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే నువ్వెందుకు మాట్లాడలేదు అని అడిగినప్పుడు ఇద్దరి నుంచి ఒకటే సమాదానం. 'నాకు మాట్లాడాలనే ఉంది కానీ నువ్వే ముందు మాట్లాడాలని మాట్లాడలేదని'. అంటే చూసుకోండి చిన్న తగువు ఎంతో అన్యోన్యంగా ఉండే స్నేహితుల మద్య ఐదు సంవత్సరాల అంతరాన్ని పెంచింది. తర్వాత రెండు సంవత్సరాలకు అంటే తన ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నాతో శాశ్వతంగా మాట్లాడకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయాడు. అప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పేంటో, చాలా సార్లు బాధ పడ్డాను కానీ ఏం లాభం, జరగకూడని నష్టం జరిగిపోయింది. అందుకే ఫ్రెండ్స్...... మనకు ఇష్టమైన వాళ్లతో ఎంత కష్టం వచ్చినా విడిపోకూడదు అదే మనం స్నేహానికిచ్చే నిజమైన విలువ అనే జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.
సుందర్

No comments:
Post a Comment