అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, September 6, 2010

అబ్బో ఇదీ కథేనా..? ;)

ఆఫీసులో ఏదో టైపు చేస్తూ పోతున్నాను తీరా అది అయిపోయిన తర్వాత చదివితే  అది నాకు కథ కానీ కథగాతోచింది ఏదయితే ఏమిటి నా బ్లాగులో పెట్టాలని పించింది పెడుతున్నాను అంతే...
ఒక రాజ్యంలో ఎంకన్న అనే వ్యక్తి ఉండే వాడు. అతనిది కష్ట పడే తత్వం. కానీ అతని కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ దక్కేది కాదు. తను కష్టపడి పండించిన పంటను భూస్వాములు లాక్కునే వారు. కనీసం ఒక్క గింజ కూడా ముట్టనిచ్చేవారు కాదు. అదేమిటని ప్రశ్నిస్తే తను చేసిన అప్పులపై భారువడ్డీ చక్రవడ్డీలు కలిపీ దొంగ లెక్కలు చెప్పేవారు.ఎంకన్న పగలంతా వ్యవసాయ పనుల్లో ఒళ్లంతా హూనం చేసుకునే వాడు. సాయంకాలం సమయంలో మార్కెట్‌లో మూటలు మోస్తూ డబ్బు సంపాధించేవాడు. పని ముగుస్తుందో లేదో అప్పుడే ఒక రౌడీ గ్యాంగ్‌ వచ్చి పని చేసిన దాంట్లో సగం లాక్కునే వారు. ఎదురు తిరిగితే విచక్షణా రహితంగా కొట్టేవారు. దాంతో ఎవరూ ఎదురు తిరిగే ధైర్యం చేసేవారు కాదు. మిగతా సగం డబ్బులతోనైనా పూటగడుస్తుందని ఇంటికి బయలు దేరితే మార్గమధ్యలో ఒక దోపిడీ దొంగల గ్యాంగ్‌ ఆ కాసిన్ని డబ్బులు దోచుకునే వారు. ఎన్ని మార్లు రాజుగారికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
మిగిలిన చిల్లరతో కూరగాయలు, కాసిన్ని బియ్యం కొనుకుందామంటే మండే ధరలతో కనీసం ఏమీ కొనలేని పరిస్థితి. దీంతో రోజు ఎంత పని చేసినా పూట పస్తులు తప్పేవి కావు తనేమో గాని, తన భార్యా, పిల్లలు కూడా పస్తులతో అల్లాడే వారు.
ఇక ఆరాజ్యానికి రాజు వీరనరసింహుడు అతనికి పిండి వంటలంటే మహా ఇష్టం రాజ్యంలో ప్రతి వారం పిండి వంటల పోటీలు పెట్టీ దానికే డబ్బులన్నీ ఖర్చు చేసేవాడు తీరా ఆ వంటకాలన్నీ పారేసేవారే కానీ ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు పోతున్నా...ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు. దాంతో రాజ్య పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏది ఏమైనా రాజుకు కను విప్పు కల్గించాలని ఎంకన్న నిర్ణయించుకున్నాడు.ఆ వారం రాజు దివాణంలో యధాతథంగా పిండి వంటకాల పోటీలు నడుస్తున్నాయి. వంట వాళ్లు ఒక్కొకరు ఒక్కోరకంగా వివిద గసగసాలు దట్టించి. రుచులకే దిమ్మదిరిగి పోయే వంటకాలను తయారు చేసి తీసుకొచ్చారు. అందరి వంటకాలు అక్కడ పళ్లాలలో పెట్టగానే వాటిఘుమఘుమలు... అబ్బో ఆ దివాణం అంతా పిండివంటకాల సువాసనలతో నిండి పోయింది. ఈ వంట వాళ్లకు తప్పకుండా రాజు ఏదో ఒక బహుమతి ఇస్తాడు. చాలా మంది వంటకాలు చేసి తెచ్చారు  తను కూడా తను తెచ్చిన వంట పాత్రలు అందరితో పాటూ వరుసలో ఉంచి నిల్చున్నాడు.ఆ రాజు కొన్ని వందల మంది వంటల రుచి చూసి ఎంతో మెచ్చుకుంటున్నాడు. మొదటి బహుమతి ఎవరికిద్దామా అని అన్ని రుచులను ఆస్వాదించసాగాడు.చివరికి ఎంకన్న వంటకాల సమయం వచ్చింది. పాత్రల మూతలు తీసి చూడగా అందులో ఏమీ లేదు కాళీ పాత్రలు మాత్రమే దాంతో రాజుకు కోపం వచ్చింది. ఎందుకు అలా చేశావని ఎంకన్నని గద్ధించాడు దానికి అతనికి భయం వేసినా తడుముకోకుండా... సమాదానం చెబుతున్నాడు... 'మా రాజా మారాజా నేను కూడా మంచి వంటవాడినండి మీకు నా చేతి వంట రుచి చూపిద్దామని బజారు కెళ్లానండి అక్కడ అన్ని సరుకులున్నాయి. కానీ ఒక్కటీ నాకు అందుబాటు ధరలో దొరకలేదండీ అంటూ సమాదానం చెప్పాడు. దాంతో ఖంగు తిన్న రాజు ఇంతకు నీ వద్ద ఎంత డబ్బు ఉందని అడిగాడు... దానికి ఎంకన్న సమాధానమిస్తూ... నాదగ్గర... నాదగ్గర చిల్లిగవ్వ కూడా లేదు మారాజా అన్నాడు మరి మార్కెట్‌కు ఎందుకు వెళ్లావు ఎందుకు ఈ వంటల పోటీలో పాల్గొన్నావు అని ప్రశ్నించగా.... కడుపు ఎంతో ఆకలితో అలమటించిపోతున్నది మారాజా ఎలాగూ అన్నం దొరకదు చచ్చిపోవడం ఖాయం చేసుకోవడానికి పని లేదు...ఉన్నా లాభం లేదు. ఎందుకంటే ఎంత చేసినా ఒక్క గింజ కూడా దక్కడంలేదు అంతా దొరలు దోచుకుంటున్నారు.. సాయంకాలం చెమటోడ్చి సంపాదించిన డబ్బు రౌడీలు సగం వాటా కాజేస్తున్నారు. మిగిలిన సగం డబ్బు దొంగలపాలవుతుంది. మిగిలిన చిల్లరతో కనీసం తిండి గింజలు కూడా రావడం లేదు. ఎలాగూ బ్రతకలేక పోతున్నాను కాబట్టి కొద్దిసేపు మీ పిండి వంటల సువాసనలు చూసి కడుపు నింపుకుందామని..... అని వచ్చాను సమాదానం అని చెప్పాడు అప్పటికే రాజు కళ్లు చెమ్మగిళ్లాయి.
రాజ్యంలో సాదారణ ప్రజానీకం ఎలా బతుకుతున్నారు. కనీసం మూడుపూటలా తింటున్నారా.. లేదా అని చూసుకోకుండా ఇలా పిండి వంటల పిచ్చితో ఎంతో మంది ఆకలి కేకలలను రంగడించి చేసిన ఈ ఫలహారలు తింటూ కాళక్షేపం చేస్తున్నాని సిగ్గుపడి!
అప్పుడే మంత్రికి చెప్పాడు 'రాజ్యంలో వెంటనే నిరుద్యోగులందరికీ ఉపాది కల్పించాలని... దొంగతనాలు దోపిడీలు అరికట్టాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని...ఎవ్వరు పండించిన పంటలపై వారికే హక్కు ఉంటుందని ఆజ్ఞలు జారీ చేసాడు'. అవి అమలు జరిగేట్లు కఠిన చర్యలు తీసుకున్నాడు. అప్పటి నుండి రాజ్యం సస్యశ్యామలంగా శోభిల్లింది ప్రతి ఒక్కరికి ఉపాది అవకాశాలు దొరకడంతో ఆరాజ్యంలో ప్రజల జీవణ ప్రమాణాలు పెరిగాయి. పరిపాలనలో సాధించిన ప్రగతికి రాజ్యం సుబిక్ష్యంగా వర్థిల్లడానికి కారకుడైన ఎంకన్నకు మంచి బహుమతిని ప్రదానం చేశాడు. తన ఆస్థానంలో సలహాదారుడిగా నియమించాడు.

No comments:

Post a Comment