నేను సిటీ నుండి వెళ్లి ఊర్లో కమ్యూనిటీ హాల్ వద్ద కూర్చోగానే రెండు చిన్ని చేతులు వచ్చి నాకళ్లను మూస్తాయి. ఏవరబ్బా అని ఆలోచించే లోపే అలాంటి చేతులు మారుతూనే ఉంటాయి. చివరకు ఎవరిని గుర్తుపట్టకపోయనా కష్టమే.... నన్ను ఎందుకు గుర్తు పట్టలేదని అలుగుతారు.. వాళ్లను ఓదార్చాలంటే వాళ్లకు ఏదో సాకు చెప్పాలి లేదా ఏదో ఒక ఆటలోకి దింపాలి. ఇక సాయంత్రం అనగా మొదలైన మా ఆటలు రాత్రి 8,9 గంటల దాకా నడుస్తూనే ఉంటాయి.
కళ్ల గంతలు, చికిలిబొట్లు, కుంటుడాట(గెంతాట), ఇంకా పొడుపు కథలు, ఇలా సాగుతూనే ఉంటాయి.చాలా మంది పెద్దవాళ్లు చూసి చిన్న పిల్లల తో ఏమి ఆటలు అనుకుంటారు. కానీ వాళ్లకు తెలియదు వారితో ఆడితే వచ్చే ఆనందం. వారు నిష్కల్మశంగా ఉంటారు, ఏది ఉన్నా నిస్సంకోచంగా చెబుతారు. మనిషి ముందర ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడరు. వారి ఆప్యాయత నాకు చాలా చిత్రంగా తోస్తుంది. ఎందుకంటే వాళ్లు బతిమాలి. అలిగి ఇంటిదగ్గర తెచ్చుకున్న రూపాయితో ఏదో చాక్లెట్టో బిస్కట్టో తెచ్చి నాకిస్తారు. ఎందుకంటే తినే దాకా అలుగుతారు. అరే ఇదేంది పక్కనున్న వాళ్లకు ఇవ్వమంటే ఇస్తేనా....
అందుకేనేమో వాళ్లతో ఉన్నంత సేపు నేను ప్రపంచాన్నే మరిచిపోతాను. ఇంత ప్రేమ ఆప్యాయతలు పంచుతున్న ఈ చిన్నారులు నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారా...? ఒకవేల ఉండకపోతే అనే ఆలోచన వస్తే చాలు కళ్లలో తెలియ కుండానే నీళ్లు తిరుగుతాయి. అంతటి ఆదరాభిమానాలు చురగొన్న నా చిన్ని నేస్తాలగురించి నాబ్లాగులో రాద్దామనుకుని చాలా సార్లు రాసాను ఎంత రాసినా తక్కువే అనిపించింది. మధ్యలోనే ఆపేసే వాన్ని.... కానీ ఎన్నిరోజులనుంచి వాయిదా వేస్తాం నాచిట్టి నేస్తాల గురించి రాయని నా బ్లాగు ఇంకెందుకు.......
సుందర్
No comments:
Post a Comment