గ్రీటింగ్ కార్డులు ఇస్తూ... ఊర్లో ప్రతి ఒక్కర్ని కలుసుకునే వారము. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఈ సంవత్సరం నా జీవితంలో మొదటి సారి ఊళ్లో సెలెబ్రేషన్స్‌లో పాల్గొనలేదు. ఆ రోజు ఏం చేశానంటే...
రోజూ మాదిరిగానే సాయంత్రం ఆఫీసుకు వచ్చాను కాని మనసంతా ఊళ్లోనే ఉంది. ఇక అందరికీ ఎస్సెమ్మెస్సులు పంపుతూ... వర్కు చేస్తూ.. ఎప్పుడు పన్నెండు అవుతుందా అని ఎదురు చూస్తున్నా... ఇంకో విషయం మర్చిపోయా... ఎలాగూ ఇంటికి వెళ్లలేదు కనుక ఆఫీసులోనే ఫ్రెండ్స్ అంతా కలిసి బిర్యాని తెచ్చుకున్నాము.. 11.30 నిమ్మలంగా తిని ఇక కేక్ కటింగ్‌కి వచ్చాము.. కేక్ కట్టింగ్ అయిపోగానే తలా ఇంత అన్నట్లు తీసుకుని. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుని ఇక ఫోన్లల్లో మునిగిపోయారు. నేను ఊరికి ఫోన్ చేసి మా వాళ్లందిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాను సుమారు 20 నిమిషాలు అందరితో మాట్లాడి కొంత మనసు బరువు దించుకున్నాను.
ఇక ఎలాగైనా ఇంటికి వెళ్లాలని ఉదయం 4 గంటలకు ఆఫీసు నుంచి శ్రీకాంత్ (మా కొలీగ్ ) బండి మీద బయలు దేరాము బర్కత్‌పుర జంక్షన్ వద్ద వాటర్ పాల్స్ అందంగా కనిపించింది. మేము అక్కడ నుంచి చాలా సార్లు వెళ్లాము కానీ ఎప్పుడు గమనించలేదు. ఆ వాటర్ పాల్స్ చూడగానే ఎందుకో మనసంతా తేలిపోయింది చాలాసేపు అక్కడే ఉండిపోవాలనిపించింది. దాని దగ్గరకు వేల్దామనుకున్నాము కానీ కుదర్లేదు ఎందకంటే గేట్‌కు తాళం ఉంది.ఇక చేసేదేమీ లేక సెల్‌ఫోన్లో ఆ దృష్యాన్ని వీడియో తీసుకుని రూమ్‌కు వెళ్లి అక్కడ నుంచి మా రూమ్ మేట్ రమేష్ నేను కలిసి పల్సర్‌పై ఎముకలు కొరికే చలిలో సైతం ఇంటికి వెళ్లిపోయాము. వెళ్లి ఫ్రెండ్స్ అందరినీ ఒక సారి కలిసి యూత్ బిల్డింగ్ ముందు విషెస్ రాసాము. సాయంత్రం వరకు వాలీబాల్ ఆడి సాయంత్రానికి ఆఫీసుకు చేరుకున్నాను. మనసు భారమంతా దిగిపోయింది. ఇక చక్కగా మళ్లీ ఒక సారి అందరికీ మెస్సేజ్‌లో విషెస్ చెప్పి పనిలో మునిగిపోయాను.
సుందర్
ఎంజాయ్ మెంట్ కు పరిణితి చెందే కొద్దీ అర్థాలు మారుతుంటాయని తెలుసుకునే మొదటి మెట్టు ఎక్కేశావబ్బాయ్. మంచిదిశగా అడుగు వేశావ్ అనుకుంటున్నా... ఆల్ ద బెస్ట్. :)
ReplyDeleteఈ వెధవ వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్, రెండో మెట్టు ఎక్కుతావు. :))