అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, January 7, 2011

నాతో జెన్నీ...

నేను సినిమా హాల్లో సినిమా చూస్తున్నాను. సినిమాలో విలన్లు హీరోమీద అటాక్‌ చేయకుండా నా మీదకు వస్తున్నారు. అప్పుడు పవన్‌ కళ్యాన్‌ లెవల్లో రెండు పంచ్‌ల్లో ఫైట్‌ అవగొట్టాను. దాంతో ఇక హీరోయిన్‌ నేను కూర్చున్న ఆటోలో ఎక్కికూర్చుంది. అరే సినిమాలో ఉండాల్సిన హీరోయిన్‌ నా పక్కన కూర్చుందేంటీ
అని అనుకుంటుండగానే మళ్లీ రౌడీలు వచ్చారు. ఈసారి చిరంజీవి లెక్క పీలయిపోయి కొట్టేదమని ముందుకు వెల్లగా వాళ్లే నన్ను మెత్తగ కొట్టి పడేసి పోయారు. అయినా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందకుచెప్మా అంటే ఏముంది రౌడీలు నన్ను కొట్టి వెళ్లిపోయిన తర్వాత కూడా హీరోయిన్‌ నా పక్కనే ఉంది. కొంచె పరికించి చూడగా ఆ హీరోయిన్‌ మరెవరో కాదు జెనీలియా... అయ్యబాబోరు జెనీలియా...నాకు సేవలు చేయడం... అర్రె నమ్మలేకపోతున్నా ఇది కలా నిజమా అని రక్తం వచ్చేట్లు గిళ్లుకున్నా... అయినా సమ్మగా అనిపిస్తోంది. ఎందుకంటే అసలే జెన్నీ అంటే నాకు చాలా.. ఇష్టం. ఇంక తను నాకు సేవలు చేయడం. ఓరిదేవుడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నా... అప్పుడే మా దోస్తుగాడు బిస్తర్‌ లాగాడు దెబ్బకు కల ''ఢాం''... రెండు మూడు బూతులేసుకుని అనవసరంగా మాంచి కలని బుగ్గిపాలు చేసావుగదరా అంటూ వాడి వెనకాల పరిగెత్తాను......
సుందర్

No comments:

Post a Comment