అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, October 6, 2014

ఆడవాళ్లపై దాడి చేయడం తప్పు... కానీ ఒక అమ్మాయి ముక్కూ చెవులూ.. కోయడం మాత్రం 'ధర్మం'...!

మంచి చెడు అని రెండు విరుద్ధ భావాలు ఉంటాయంట..

కానీ కొన్ని సార్లు చెడు అని చెప్పుకున్నదే..
ధర్మం అనే పేరుతో ఈ సమాజంలో చలామణి అవుతోంది.. ఏమిటో విచిత్రం..!

ఆడవాళ్లపై దాడి చేయడం తప్పు...
ఒక అమ్మాయి ముక్కూ చెవులు కోయడం మాత్రం 'ధర్మం'..

అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను అనుమానించడం తప్పు..
లోకం పేరు చెప్పి భార్యను మంటల్లోకి వెళ్లమనడం ధర్మం..

జీవితాంతాంతం కలిసి ఉంటానని పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరిగా వదిలేయడం తప్పు..
అదే భార్యని అందునా.. నిండు గర్భిణిని కారడవిలో వదిలేయడం 'ధర్మం'..

విలన్ అనే పేరుతో ఒకరిని హత్య చేస్తే హంతకుడు..
హీరో అనే పేరుతో చంపితే దుష్ట సంహారం..

దేవుడా.. ఎవడికి అనుకూలంగా ఉన్నది వాడు.. 'ధర్మం'గా చెప్పుకోవడం.. సమర్థించుకోవడం ఫ్యాషన్ అయ్యింది...!

సుందర్

5 comments:

  1. లోకం పేరు చెప్పి భార్యను మంటల్లోకి వెళ్లమనడం ధర్మం..
    Which means "You didn't read Ramayana"

    ReplyDelete
  2. Dharma changes with Time, place and situation.
    But 'Satya' never changes.
    You were taking about "Dharma" so it is justified.

    ReplyDelete
  3. you are hundred percent correct.

    ReplyDelete
  4. దేశ సరిహద్దుల్లో యుద్దం వస్తే సైనికులు శతృవుల్ని చంపుతారు కదా అని మీకు ఇష్టం లేనివాడిని చంపితే శిక్ష విధిస్తారు. అప్పుడు కోర్టులో చెప్పండి మీ ధర్మం గురించి, న్యాయం గురించి..

    ReplyDelete
  5. chinnapillavaadivi
    telusukovaalane utsaaham manchide
    kaani anneetelusu ani teerpulichchnatlu cheppatam tappukadaa ?
    paigaa dosham kudaa


    ReplyDelete