అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, February 12, 2014

ప్రపంచ క్రికెట్ కు పెద్దన్నగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న బిసిసిఐకి కునుకులేకుండా చేస్తోంది..? భారత్ కు రెండు ప్రపంచ కప్ లు అందించిన కెప్టెన్ ను వణికిస్తోందో భూతం... ఈ పెను భూతం ఐపిఎల్ ను మింగేయనుందా..?

             భారత క్రికెట్ లో ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో ఫిక్సింగ్ కు పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్, తదితరులను మరవకముందే.. అదే ఫిక్సింగ్ లో మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ పూర్తిచేసిన ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో టీమిండియా కెప్టెన్ ధోని, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రైనా పేర్లు ఉన్నాయన్న వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఐపీఎల్లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు చెందినది కావడం, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముద్గల్ కమిటీ దాదాపు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. ధోనీ, రైనా పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిక్సర్ ఎవరు..?
          ముద్గల్ కమిటీ పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. తన నివేదికలో ‘ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరుగురు భారత ఆటగాళ్లకు సంబంధం ఉంది. వారిలో ఒక క్రికెటర్ ప్రస్తుతం జట్టులో ఉన్నాడు. అతను గత ప్రపంచకప్‌లోనూ ఆడాడు’ అని నివేదికలో పేర్కొంది. గత ప్రపంచకప్ ఆడి ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లు ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అశ్విన్ మాత్రమే. మరి వీరిలో ఫిక్సర్ అన్నది త్వరలో తేలనుంది.
    
         ఊహించనంత ఫేమ్.. కోటాను కోట్ల ధనం సంపాధించి కూడా క్రికెట్ కు మచ్చ తెచ్చే ఇలాంటి పనులకు పాల్పడిన వారు ఎంతటివారైనా శిక్షార్హులే. 


with courtesy
www.10tv.in
see more at....
http://www.10tv.in/news/national/MS-Dhoni-and-Suresh-Raina-involved-in-IPL-Spot-Fixing-30746


సుందర్

No comments:

Post a Comment