అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, January 5, 2011

నా ఈత రికార్డుని గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి

నేను మీకో ఈత రికార్డు గురించి చెబుతా ప్రపంచంలో ఎవరూ... ఎక్కడా ...సాధించనిది. అంత గొప్ప రికార్డు గురించి మీకు తెలుసుకోవాలని ఉంది కదా అయితే చదవండి..

నేను మూడవ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారిగా మా అన్నయ్య ఈత నేర్పించడానికి తీసుకెళ్లాడు. ఒక వారం రోజులు వెళ్లి  బంద్‌ చేశాను. కారణం ఏమిటంటే నేను ఈత నేర్చుకుంటున్నది  అప్పుడప్పుడే అసలే నీళ్ళంటే భయం.  అందుకే నా భయం పోగొట్టాలని  ఒక వ్యక్తి నన్ను నీళ్లలో ముంచాడు... కాని భయం ఇంకా.ఎక్కువైంది...  దెబ్బకు తర్వాతి రోజునుంచి ఈత బంధ్‌.....

ఆ సమ్మర్‌ అలా గడిచింది. సమ్మర్‌ అని ఎందుకంటున్నానంటే ఊళ్లల్లో ఈతలకు వెళ్లేది వేసవి కాలంలోనే...
తర్వాత సంవత్సరం మళ్లీ ఈత నేర్చుకోవడానికి బెండు తయారు చేసుకుని రెండు మూడు రోజులు వెళ్లాను. అప్పటి నుంచే నాకు క్రికెట్‌ అంటే మహా పిచ్చి. అంతా ఇంత కాదు అన్నం... స్నానం... ఇల్లు అన్నీ విడిచిపెట్టి ఎండనక వాననక ఒక  రెండు రూపాయల చిన్న చెండు(బాల్) కొనుకున్ని చెక్క బ్యాటు (ఆముదాలు కొట్టే చెక్క) పట్టుకుని ఒకటే  క్రికెట్‌ ఆడిని. దాంతో ఆ సంవత్సరం  నా ఈత గంగలో కలిసింది.
విశేషం ఏమిటంటే మా ఊళ్లో ఈతకు రెండు బ్యాచ్‌లుగా వెళ్లే వారు. ఒకరు పెద్దవాళ్లు అంటే ఇంటర్‌, టెంత్‌, ఆపైన చదివేవాళ్ళు, మరొకరు అంత కంటే చిన్న వాళ్లు అంటే బిలో టెన్త్ అన్నమాట... అయితే చిన్న వాళ్లు ఈతకు వెళితే పెద్దవాళ్లు క్రికెట్‌ ఆడేవాళ్లు దాంతో వారితో జాయినయ్యి లాంగ్‌ కీపర్‌ ఉండి బాల్‌ అందించేవాణ్ణి. ఇక చిన్న వాళ్లు వచ్చే సరికి పెద్దవాళ్లు ఈతకెళ్లేవాళ్లు దాంతో ఇక అప్పుడు లాంగ్‌ కీపర్‌ కాస్త కెప్టెన్‌ అయ్యేవాడు. (అంటే చిన్న పిల్లల్లోన నేనే కెప్టెన్‌ అన్నమాట)
ప్రతి సంవత్సరం సమ్మరంతా క్రికెట్‌కే అంకితమయ్యేవాణ్ణి. నాతో పాటు ఈత నేర్చుకునేందుకు వచ్చిన వాళ్లంతా ఎప్పుడో ఈత నేర్చేసుకున్నారు. ఆ సమయంలో నేను మాత్రమే ఇంకా ఓనమాల స్టేజీలోనే ఉన్నా..
ఇక చాలా సంవత్సరాలు ఇలాగే గడిచాయి. వేసవి రాగానే బెండు తయారు చేసుకోవడం రెండు మూడు రోజులు ఈతకు వెళ్లడం బంద్‌ చేయడం. దీంతో నా ఈత కాస్త క్రికెట్‌ గ్రౌండ్‌ దగ్గరే ఆగి పోయింది.
9వ తరగతి వరకూ... ఇదే తంతు నాకంటే చిన్న వాళ్లకు ఈత వచ్చేది నాకు మాత్రం ఊహూ...
ఇది గమనించి ఒక రోజు మా నర్సింహ్మ (అన్నయ్య) ఈతకు పోదాందా రారా.. అన్నాడు... పోదాం పద అన్నాను. టైమ్‌ 3.30 నాలుగు అవుతుంది. ఈ టైమ్‌లో ఈతేంటీ ఊరికే అంటున్నాడనుకున్నా.. కానీ నిజంగనే బావి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈత కొడదాం పదరా అన్నాడు. సరే అని బావిలోకి దిగాము. సరే నువ్వు కాళ్లు చేతులు ఆడించు నేను నీ మొలతాడు పట్టుకుంటాను అన్నాడు.  సరే అని కాళ్లు చేతులు కొడుతూ అవతలి ఒడ్డుకు చేరాను. అప్పుడతడన్నాడు నేను నిన్ను పట్టుకోలేదు రా... నువ్వే కొట్టావు అని చెప్పడంతో నాకు చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. వెంటనే అవతలి ఒడ్డుకు ఎవరు తోడు లేకుండానే వెళ్లాను. ఒడ్డు వరకు బాగానే వెళ్లాను ఒడ్డు దగ్గర గుటుక్ గుటుక్ అంటూ నీళ్ళు మింగుతూ...  మునిగిపోతుంటే నర్సింహ్మ వచ్చి సాయం అందిచాడు. అలా...
నేను 3వతరగతి లో ప్రారంభించిన  నా ఈత దండ యాత్ర తొమ్మిదవ తరగతి సమ్మర్లో ఒక కొలిక్కి వచ్చింది.

అయితే ఇక పాయింట్ కి వద్దాం... ఎవరైనా ఈతను ఒక వారంలో లేదా..  పదిహేను రోజుల్లో.. మహా అంటే నెల రోజుల్లో నేర్చు కుంటారు. కానీ ఆరు సంవత్సరాల పాటు ఎవడయినా  నేర్చుకుంటాడా.........?  నేను నేర్చుకున్నా... కాబట్టి ఇదీ ఒక రికార్డే అందుకే గిన్నిస్‌ బుక్కులో వేయిద్దామనుకుంటున్నా ఏమంటారు...........!!!!
- సుందర్

1 comment:

  1. 3 weeks lo swimming nijamga vasthundha...? Bcoz nenu recent ga veldam ani anukuntunna. Trainer ni maatladali..

    Manoo..

    ReplyDelete