అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 3, 2011

బీరు సీసా దొంగతనం

నేను 8,9 వ తరగతి ఉండగా అనుకుంటా...! మేము హయత్‌ నగర్‌ హాస్టల్‌లో చదివేవాళ్లం. మా దోస్తుగాళ్లు మహా జాదుగాళ్లు ఉండేవారు. బీరు సీసా అని మా దోస్తుగాళ్ల గురించి చెప్పగానే మీ బుర్రకు ఒకటి తట్టి వుంటుంది. వీడు వీడి దోస్తులు కలిసి ఫుల్‌గా కుమ్మేసుంటారు... దేడ్‌ గాళ్ళు అనుకుంటారు. .కానీ నేను చెప్పేది వేరు. నేను చదివింది  హయత్‌ నగర్‌ కనుక చుట్టూ సినిమాహాల్లే వనస్థలీ పురం, ఎల్‌బినగర్‌ ఇంకా ఆ ప్రాంతంలో సుమారు నాలుగైదు సినిమా హాళ్లుంటాయి. మేము అప్పుడు రిలీజ్‌ అయిన ప్రతీ సినిమా చూసే వాళ్లం. ఇక విషయానికి వస్తే ఒక రోజు సినిమాకు వెళ్లానుకున్నాం. ఆ రోజుల్లో మేము10రూపాయల టిక్కెట్‌ మాత్రమే. వెళ్లేవాళ్లం మా దగ్గర 100 రూపాయలున్నా సరే పది రూపాయల టిక్కెట్టే...
అవసరమయితే మిగతా డబ్బులు ఫుల్‌గా చిరుతిళ్లు తినే వాళ్లంగానీ అంతకంటే ఎక్కువ టిక్కెట్‌కి మాత్రం వెల్లేవాళ్లకాదు.
ఆరోజు మా ఫ్రెండ్స్‌ అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కానీ మా  నరిగాని దగ్గర లేవు. మధ్యలోకి వెళ్లిన తర్వాత తన దగ్గర డబ్బులు లేవని వాడు చెప్పాడు . మా అందరి దగ్గర సినిమా టిక్కెట్‌ మాత్రమే సరిపోయే డబ్బులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ లేవు. ఖతం ఇగ మాకు వాడిమీద పిచ్చ కోపం వచ్చింది. అరెె హాస్టల్‌ దగ్గర చెప్పొచ్చుగా భే..... అని బాగా తిట్టాము. విడిచిపెట్టిపోదామా అంటే దోస్తుగాడు ఏంజేద్దాం అనుకుంటుంటే... పక్కనే ఒక వైన్‌ షాప్‌ కనిపించింది. వెంటనే మాకు ఒక ఐడియా వచ్చింది. పక్క వీదిలోనే పాతా ఇనుప సమాన్‌ దుకాన్‌ ఉంటుంది. కాబట్టి ఒక మూడు నాలుగు సీసాలైతే మనోడు సినిమా చూసినట్టే అన్నాడు మా దోస్తొకడు.. ఖతం వెంటనే ఒకడు వెళ్లాడు ఒక సీసా తీసుకొచ్చాడు. వేరే వాడు వెళ్ళి మరో సీసా తీసుకొచ్చాడు. నరిగాడు వెళ్లి సీసా పట్టుకున్నాడోలేదో ఒకడు వచ్చాడు చాలా పొడుగు బందవస్తు ఉండు. ఏందిరా? సీసాలు ఎత్కపోతున్నావ్‌ భే అన్నాడు మనోడికి చెమటల్‌ పట్టినరు.. ఏం లేదన్నా..... ఏం లేదన్నా....! అనుకుంటూ... మెల్లగా అక్కడినుండి జారుకుండు. కానీ ఇంకా సినిమాకు కావాల్సిన డబ్బులు సరిపోలేదు. తప్పని సరిగా ఒక్క సీసా అయితే ఎంచక్కా సినిమాకెళ్లొచ్చు. అందరం డిసైడ్‌ అయ్యాం. నలుగురం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము.. వెననుంచి మా చాటుగా మా రమేష్‌గాడు వస్తున్నాడు. మేము అడ్డం ఉండండంతో వాడు ఒక సీసా తీసుకున్నాడు. కానీ మేము అనుకున్నట్టు ముందునుంచి కాదు వెనక నుంచి ఎవడో చూసాడు. చూసినోడు ఊరుకుంటాడా పేద్దగా కేకలు వేస్తూ వస్తున్నాడు. ఒక్కసారి వెనకు చూసి అందరం పరార్‌. డైరెక్టు పాతా ఇనుప సామాన్‌ కాడ తేలినం. సీసాలు అమ్మి సినిమాకు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసి వచ్చాము. ఇగ అప్పటినుండి ఎవడు సినిమాకు వెళ్లాలన్నా సీసాలు మెల్లగా కమాయించేది. దాందో అక్కడున్న వాళ్లకు డౌటొచ్చింది. అప్పటినుంచి సాయంత్రం పూట ఆ వైన్‌ షాపు ముందునుంచి పిల్లలను తిరగనిచ్చేవారు కాదంటే అది ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోండి.
సుందర్

1 comment: