అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, March 15, 2012

అరకుకు ఏడు కిలోమీటర్ల దూరంలో...??!!!

 అరకుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఏం జరిగుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా...? మొన్న ( మార్చి 10.11.12 తేదీల్లో) కాలేజీ నుండి వైజాగ్‌కు టూర్‌ వెళ్లాం. మొదటి రోజు అన్నవరం వెళ్లాము. హైదరాబాదులో ఉదయం ఏడుగంటలకు ట్రైను ఎక్కితే అన్నవరం వెళ్లే సరికి రాత్రి ఏడు అయ్యింది.
అక్కడ 12గంటల వరకు ఉన్నాము. తర్వాత రైల్వేస్టేషనుకు వెళ్లాము. అక్కడనుండి రాత్రి 3 గం||లకు ట్రైన్‌ ఉంది. తర్వాతి రోజు సింహాచలం వెళ్దాం అంటున్నారంతా. అప్పుడే నేనూ, సతీష్‌ ( మా క్లాస్‌మేట్‌) అన్నాము ''మనం ఏమన్నా కొత్త జంటలమా పుణ్య క్షేత్రాలు తిరగడానికి రేపు వైజాగ్‌లోనే అన్ని ప్రదేశాలు తిరుగుదాం..'' అన్నాం. అందరూ సరే అన్నారు. అసలు ఈ టూర్‌లో సింహా చలం అవసరం లేదు వైజాగ్‌, అరకు, బొర్రా గుహల దగ్గర ఎక్కువ స్పెండ్‌ చేద్దాం అనుకున్నాం.
అనుకున్నట్టుగానే నెక్ట్స్‌ డే వైజాగ్‌లో చూడ దగ్గ ప్రదేశాలన్నీ చూసేసి  సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు  బీచ్ లో ఎంజాయ్  చేసి లాడ్జ్ కి వెళ్లాం... నెక్ట్స్‌ డే అరకు వెళ్దామని ప్లాన్‌ చేసుకున్నాం. మార్నింగ్‌ 7గం||లకు ట్రైన్‌ ఎక్కితే బొర్రా గుహలకు చేరుకోవడానికి 11.30 అయ్యింది. అక్కడ ఒక కమాండర్‌ (జీపు) మాట్లాడుకుని బొర్రా గుహలు, వాటర్‌ఫాల్స్‌, అరకు చూద్దాం అని బయలుదేరాము. ఇక వాటర్‌ ఫాల్స్‌, బొర్రా గుహలు చూసే సరికి 3.30 అయింది.
అక్కడనుండి జీపులో అరకు బయలుదేరాము. చాలా మలుపులు ఎత్తు  పల్లాలు ఉన్నాయి. ఒక చోట టర్నింగ్ వద్ద చాలా ఎత్తు ఉంది అది ఎక్కుతూనే జీపు సడెన్  గా  ఆగిపోయి వెనక్కి వస్తోంది..... ఇంకా నయ్యం ఇంకొచెం లో లోయలో పడిపోయేవాళ్ళం డ్రైవర్ బ్రేక్ వేసి దిగి చూసి మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఎమైనది అన్నా అంటే ఏం  కాలేదు పదండి అన్నాడు. ఒక చోట కొంత మంది ఆడవాళ్లు ఏదో చందాలు వసూలు చేస్తున్నారు. వాళ్లు మా జీపును ఆపి చందా అడిగారు మా డ్రైవర్‌ ఏదో మాట్లాడుతున్నాడు. ఏంటీ బాబు బండి పంక్చర్‌ అయ్యింది చూసుకోలేదా అన్నారు వాళ్లు. చూసే సరికి వెనక టైర్‌ పంక్చర్‌ అయిఉంది. ఇక టైర్‌ మార్చడానికి 20 నిమిషాలు పట్టింది. మళ్లీ అక్కడనుండి బయలు దేరి కాఫీ తోటల దగ్గరకు చేరుకున్నామో లేదో మళ్లీ పంక్ఛర్‌ అయ్యిది ఇక మా దగ్గర స్పేర్‌ టైర్‌ లేదు. చాలా సేపు వెయిట్‌ చేస్తే. ఒక జీపు వచ్చింది ఆ డ్రైవర్‌ను రెక్వెస్ట్‌ చేసి టైర్‌ ఫిట్‌ చేసుకునే సరికి అర్థగంటకు ఎక్కువే పట్టింది. టైర్‌ రిపేరు అయితే అయ్యింది కానీ జీపు స్టార్టు అవ్వట్లేదు. ఒక అర్థ కిలోమీటరు తోసాము చివరకు స్టార్ట్‌ అయ్యిది. రయ్.... అంటూ వెలుతోంది.
 వ్యూవ్‌ పాయింట్‌ చూసి. అక్కడ నుండి బయలు దేరాము అరకు 10 కిలోమీటర్లు, 9కిమీ, 8కిమీ, అని బోర్డులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అరకు 7కిమీ బోర్డు అప్పుడే వెళ్లిపోయింది. ఇక మరో 10 నిమిషాల్లో అరకుచేరుకోబోతున్నాం అని ఉత్సాహంగా ఉన్నాం. అప్పుడే జీపు డుర్‌.. డుర్‌ అని ఆగిపోయింది. మళ్లీ ఆగిందా అని మావాళ్లంతా విసుక్కుంటున్నారు ఇప్పుడేమైందా అని చూస్తే ఎక్స్లేటర్‌ పనిచేయడం లేదు. ఒక 20 మినట్స్‌ ట్రై చేశాం. ఇక లాభం లేదని మా బ్యాగులు తీసుకున్నాము. అరకు వైపు నడుచుకుంటూ బయలుదేరాం ఏవైనా వెహికిల్స్‌ వస్తే ఆపి ఎక్కుదామని...! జీపును 3200 రూ||లకు మాట్లాడుకుంటే  రెండు మూడు ప్లేసులు చూయించి నాలుగైదు సార్లు రిపేరవ్వడంతో మా వాళ్లంటున్నారు. 'ఇప్పటికే జీపు వానికి 1750రూ||లు ఇచ్చాం. ఇక అస్సలు డబ్బులు ఇవ్వద్దు అంటూ బయలు దేరాం. అప్పటికే టైం 6గం|| దాటింది అరకు నుండి 7.30కి లాస్ట్‌ బస్‌ ఉంటుందని జీపువాడు చెప్పాడు. ఇక అరకు వెళ్లలేం వెళ్లినా ఏం చూడలేం అనుకున్నాం. ఎందుకంటే రేపు (సోమవారం) మార్నింగ్‌ 6గం||ల రివర్స్ ట్రైన్‌కు   టికెట్స్ ఎప్పుడో బుక్‌ చేసుకున్నాం. అందుకే ఇక వెనక్కు మళ్లాలి అనుకున్నాం.  అప్పుడే ఒక క్వాలీస్‌ వచ్చింది, జీపువాడు అతనికి మంచి ఫ్రెండ్‌ అనుకుంటా.  అన్న లాస్ట్ బస్ కూడా కరాబ్ అయ్యింది మీకు ఇప్పుడు  వెల్లడానికి ఏం లేవు అందుకే నా క్వాలీస్ ఎక్కేయ్యండి వైజాగ్ లో దింపుతా అంటున్నాడు. అప్పు డే ఒక బస్‌ వచ్చింది ఎక్కుదామని ముందుకు వెళ్లాము. అన్నా డబ్బులివ్వండే అంటూ వచ్చాడు జీపువాడు. 'అరకు మాత్రమే చూపించలేదు కదా ఇవ్వాల్సిన డబ్బుల్లో ఒక 100 రూపాయలు తక్కువ ఇవ్వండి అంటున్నాడు''. లేదు లేదు మేం వచ్చిందే అరకు చూడటానికే అరకు చూపించకుండా టూర్‌ మొత్తం నాశనం చేసి ఇంకా 100 రూపాయలు తక్కువ ఇమ్మంటావా అని ఒక అరగంట ఆర్య్గూమెంట్‌ చేసాం ఒక కొట్టడంతప్ప కొట్టినంత పని చేశాం. చివరకు ఒక 500 ఇచ్చాము. అప్పుడు క్వాలీసు వాడంటున్నాడు అన్నా 6.30 అవుతోంది లాస్ట్‌ ఇక మీరు ఈ క్వాలీస్‌లో ఎక్కండి అన్నాడు. అప్పుడే ఆర్టీసి బస్‌ అక్కడ్నుండి వెళ్తోంది ఆపి ఎక్కాం. అందరి మూడ్‌ అప్‌సెట్‌ అయ్యింది. అరకు ఎలాగూ వెళ్లలేదు కనుక సింహాచలం వైజాగ్‌కు దగ్గరే కనుక నైట్‌ సింహాచలం వెళ్దామని డిసైడ్‌ అయ్యాం. సింహాచలం వెళ్లి డిన్నర్‌ కంప్లీట్‌ చేసే సరికి 11.30 అయ్యింది. ఇక గుడికి బయలుదేరాం  గుడిముందు ఒక గుడిసెలో ముసలాయన అన్నం తింటున్నాడు. ఆయన అన్నాడు "గుడిపైన ఏం లేదు బాబు. చుక్క నీరు దొరకదు గేటు మూసి ఉంటుంది, దోమలు ఉంటాయి మీరు ఇప్పుడు వెళ్లి ఏం చేస్తారు" అని. అయినా వినకుండా మెట్లు ఎక్కుతున్నాం. అప్పటికే చాలా తిరగడంతో కాళ్లు పీకుతున్నాయి. అలా కష్టపడి ఒక అర్థగంటపాటు మెట్లు ఎక్కాం (అర్థగంట పట్టిందంటే ఎన్ని మెట్లు ఉంటాయో ఆలోచించండి).
 కరెక్టు 12గంటకు పైనకు చేరుకున్నాము( 12తారీకు 12 గం||లకు 12 మందిమి 2012లో అని మా వాళ్లు లాజిక్కులు కలుపుతున్నారు. పైనకు వెళ్లే సరికి విశాలమైన గ్రౌండ్‌ అక్కడ రెస్ట్‌ రూంలు బాత్‌రూంలు వాటర్‌ సౌకర్యం చూసే సరికి వచ్చిన కష్టాన్నంతా మర్చిపోయాం. ఇక మార్నింగ్‌ 3గం||లకి లేచి స్నానాలు చేసుకుని దర్శనం పూర్తి చేసుకునే సరికి 5 అయ్యింది. సింహాచలంలో 5.10కి ఆటో ఎక్కితే వైజాగ్‌ వెళ్లే సరికి 5.45 అయ్యింది. ట్రైన్‌ రెడీగా ఉంది. అబ్బ మూడు రోజుల టూర్‌ అప్పుడే ముగిసింది. చివరకు అరకు చూడకుండానే ట్రైన్‌ ఎక్కుతున్నాం అనుకుంటూ ట్రైన్‌ ఎక్కేసి రిజర్వ్‌డ్‌ సీట్లల్లో కూర్చున్నాము. 
సుందర్

2 comments:

  1. ఎందుకిలా జరిగి ఉంటుందో కాస్త స్థిమితంగా ఆలోచించండి,కారణం మీకే స్పురిస్తుంది.

    ReplyDelete
  2. మీరు వద్దనుకున్నా ఆ సింహచలం అప్పన్న మిమ్మల్ని తన దగ్గరికి రప్పించుకున్నాడన్నమాట

    ReplyDelete