అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 10, 2011

సిగ్గుచేటు...

ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది చర్చించాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. క్రీడాకారులను సంతలో పశువుల్లా వేలం వేసి అందులో అధిక ధర పలికిన వారిని కొనుక్కుని వారి వారి(ప్రాంచైంజీల) దొడ్లలో కొట్టుకున్నట్లనిపిస్తోంది. డబ్బుల మైకంలో పడి మానం మర్యాదలు మర్చిపోయి ఇలా వేలంలో తమను తాము అమ్ముకోవడం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారిదగ్గరకు పోవడం ఇది మొత్తం ఒక వ్యభిచారాన్ని తలపిస్తోంది. ఇలాంటి పదాలు వాడుతున్నందుకు నాకే ఎలాగో అనిపిస్తుంది.
ఈ తతంగంలోనూ....
కుటిల రాజకీయాలు నడుస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా క్రికెట్‌ అంటే తెలియని వారు నేడు డబ్బు ఉందని ప్రాంచైంజీలుగా మారడం ఆ క్రికెట్‌ విలువ తెలియక, ప్రపంచ క్ర్రికెట్‌కే వన్నె తెచ్చిన క్రీడాకారులను విస్మయించి బహిరంగంగా అవమానించడం ఈ అవమానం ఆ క్రీడాకారులకు కాదు ప్రపంచ క్రికెట్‌కు అవమానం.
అదలా ఉంచితే భారత జట్టును ఉన్నత స్థితికి తీసుకురావడంకోసం అవిశ్రాంతంగా శ్రమించి. ఎందరో యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారు పలుమార్లు విఫలమైనా సెలక్షన్‌తో పోట్లాడి వారికి మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పిస్తూ వారిలో స్థైర్యాన్ని నింపి నేడు భారత జట్టుకు సెహ్వాగ్‌, దోనీ, యువీ, రైనా, లాంటి అరుదైన ఆణిముత్యాలను అందించిన భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్‌, అలనాటి మేటి ఓపెనర్‌ వన్డేల్లో 22సెంచరీలు సాధించి, 11పరుగులు సాధించి భారత జట్టుకు కెప్టెన్‌గా, బ్యాట్‌మెన్‌గా బౌలర్‌గా సేవలందిస్తూ తన సారధ్యంలో జట్టును వరల్డ్‌కప్‌ పైనల్‌కు తీసుకుకెళ్లిన గొప్పక్రికెటర్‌ సౌరవ్‌ గంగూలిని విస్మయించడం... అసలు అతని పేరునే ప్రస్తావించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ వేలం వెర్రి ఇలాగే సాగుతూ పోతే సచిన్‌, సెహ్వాగ్‌, దోనీలకు కూడా ఇలాంటి అవమానం ముందు పొంచి ఉందన్న విషయాన్ని గమణించాలి. ఎందుకంటే ఏ బ్యాట్‌మెన్‌ జీవిత కాలం ఫామ్‌లో ఉండడు. 
సుందర్

No comments:

Post a Comment