అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, January 12, 2011

బెంగాల్‌ టైగర్‌ "దాదా గిరి"

ఉట్టిపడే రాజసం.. గ్రౌండ్‌లో అడుగిడుపెడితే ఆటకే ఒక కళ.. తప్పు జరిగితే జూనియర్లు సీనియర్లు అన్న తేడాలేకుండా అందరినీ హెచ్చరించే నైజం. గడ్డు పరిస్థితుల్లో ఉన్న క్రికెటర్లకు వెన్నంటి ఉండి వారిలో మనో మనోస్థైర్యాన్ని నింపి వారు మళ్లీ రాణించేలా ప్రోత్సాహాన్ని అందిచడం. ఎదుటి జట్టును ట్రిక్కులతో.. అవసరమైతే టెక్కులతో.. సైతం అధరగొట్టే తత్వం. అతను ఒక అనితరసాధ్యుడు.... బ్యాట్‌మెన్‌గా టన్నులకొద్దిపరుగులు సాధించి టెస్టుల్లో వన్డేల్లో అనేక సెంచరీలు, రికార్డులు సాధించి.. అవసరమైతే బాల్‌తోనూ అద్భుతాలు సృష్టించి... కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించి గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్‌రూంలో సభ్యులను ఏక తాటిపై నడపడం... నమ్ముకున్న వాళ్లను జట్టులో నిలబెట్టేందుకు సెలక్షన్‌ కమిటీతో... కోచ్‌తో అయినా పోట్లాడే గట్స్‌... వెరసి బెంగాల్‌ టైగర్‌ సౌరవ్‌ చండీదాస్‌ గంగూలి. 
                                               బాల్యం
పశ్చిమ బెంగాల్‌ కోల్‌కాతాలో 72జూలై 8న ఉన్నత కుటుంబంలో జన్మించిన గంగూలి చండీదాస్‌, నిరూపాగంగూలి దంపతుల కనిష్ట పుత్రుడు. చిన్నతనం నుంచే మహాజరాజాగా పిలవబడే 'దాదా' చిలిపి చేష్టలు, తగువులకు నెలవు. పెద్దయ్యాక కూడా ఆ తగువులాడే గుణం ఆ రాజసం ఏ మాత్రం పోలేదు. ఉదాహరణకు 1992లో నేషనల్‌ టీంలోకి వచ్చిన కొత్తలో ఎవ్వరికీ డ్రింక్స్‌, బ్యాట్స్‌ అందించనని నిక్కచ్చిగా చెప్పడంతో పాటు ఇతగాడి దుందుడుకు స్వభావంతో టీంనుంచి వైదొలగడం జరిగింది.
                                              క్రికెట్‌ ఆరంగేట్రం 


 దాదా చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని, అన్న స్నేహశిష్‌ ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. సహజంగా కుడిచేతి వాటం కలిగిన గంగూలి అన్న స్నేహిత్‌ పరికరాలు ఉపయోగించుకోవడంకోసం ఎడమచేతి బ్యాటింగ్‌ సాధన చేశాడు. అలాగే బౌలింగ్‌లో రైట్‌హ్యాండ్‌ మీడియమ్‌ ఫాస్ట్‌ బౌలర్‌గారాణించాడు.తండ్రి అతని ప్రతిభను గుర్తించి కోల్‌కాతా లోని ప్రముఖ అకాడమీలో చేర్పించాడు. స్కూల్‌ టీంలో సెంచరీ చేసి రాణించడంతో రంజీల్లోకి అవకాశం లభించింది. రంజీల్లోనూ మంచి ప్రతిభ కనబర్చడంతో 1992లో టీంలోకి తీసుకున్నారు. ఆరంగేట్రం చేసిన మొదటిమ్యాచ్‌ లో వెస్టిండీస్‌తో ఆడటం జరిగింది ఆ మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు చేశాడు దాంతో టీం నుండి తప్పించారు. ఆతర్వాత జరిగిన రంజీ మ్యాచ్‌ల్లో అధ్భుతంగా రాణించాడు. 1995 - 96 రంజీ సీజన్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 171 పరుగులు సాధించడంతో మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపు వచ్చింది. అప్పట్లో సచిన్‌ టెండూల్కర్‌కు ఓపెనింగ్‌ జోడీ కోసం గాలిస్తున్న తరుణంలో ఒక చక్కటి అవకాశాన్ని అంది పుచ్చుకుని ఇక వెనుదిరిగి చూడలేదు. లార్డ్స్‌లో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత సచిన్‌తో కలిసి అనేక మ్యాచ్‌ల్లో టన్నుల కొద్ది పార్టనర్‌షిప్పులనందిస్తూ నువ్వానేనా అన్నట్లు ఆడుతూ... ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 1999 లో జరిగిన ప్ర్ర్రపంచ కప్‌లో మ్యాచ్‌లో 186 పరుగులు చేసి వ్యక్తీ గతంగా  అత్యదిక పరుగుల రికార్డును నెలకొల్పాడు. అప్పట్లో అదే భారత అత్యుత్తమ స్కోరు.( తర్వాత సచిన్‌ 186 మాత్రమే అంతకంటే ఎక్కువ) ఆ మ్యాచ్‌లో ఏకంగా 17 పోర్లు, 7 సిక్సర్లు బాధి బౌలర్లలకు చుక్కలు చూపించాడు. ద్రావిడ్‌తో కలిసి 319 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇది ప్రపంచకప్‌లో అత్యుత్తమ బాగస్వామ్యం అలాగే ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యుతమ రెండో భాగస్వామ్య.
పెళ్లి
 తన చిన్న నాటి స్నేహితురాలు. డోనారాయ్ ను ప్రేమించాడు. అప్పటికే ఆ ఇద్దరి కుటుంబాల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ పెద్దలను ఒప్పించి తన ప్రియురాలును 1997 ఫిబ్రవరిలో తన ఇల్లాలిగా  చేసుకున్నాడు 'పిన్స్‌'. 2001లో డోనా కడుపున పువ్వుపూసింది ఆ పువ్వే 'దాదా' గారాల పట్టి సనా గంగూలి.
                                     కెప్టెన్‌ గా 'దాదాగిరి'


  2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం తర్వాత సచిన్‌ తన కెప్టెన్సీలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో దాదాకు కెప్టెన్‌ పగ్గాలు అప్పజెప్పారు. వచ్చీ రావడంతోనే దక్షిణాప్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను గెలుచుని తన నాయకత్వ శక్తిని తెలియజేశాడు. ఆ సిరీస్‌లో రెండు సెంచరీలు కూడా సాధించాడు అందులో ఒకటి ఫైనల్‌ మ్యాచ్‌లో చేసాడు. ఒత్తిడిని తట్టుకోవడంలో దాదాకు సాటిలేరెవ్వరు. అని నిరూపించాడు. తర్వాత న్యూజీలాండ్‌తో జరిగిన సిరీస్‌ను గెలుచుకోవడంకోవడం జరిగింది.
అసలు సవాల్‌ 2001 లో వచ్చిపడింది. వరుసగా 16 టెస్టుల జైత్రయాత్రను కొనసాగించుకుంటూ భారత్‌ విచ్చేసిన స్టీవ్వా జట్టును 2 - 1 తేడాతో మట్టికరిపించడం ద్వారా ప్రిన్స్‌ గంగూలి సేన సంచలనం మేమే క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్నాం అంటున్న ఆస్ట్రేలియన్ల గర్వాన్ని ఈడెన్‌గార్డెన్లో మట్టికరిపించారు. ఆ మ్యాచ్‌లోనే హైదరాబాదీ సొగసరి లక్ష్మణ్‌ 281, ద్రావిడ్‌ 180పరుగులుచేసి 376 పరుగుల రికార్డును నెలకొల్పి ఫాలో ఆన్‌లో ఉన్న జట్టును విజన్నందించారు.
2002లో నోట్‌వెస్ట్‌ట్రోఫీ ఫైనల్‌ లార్డ్స్‌లో యువీ, కైఫ్‌ అద్భుతంగా ఆడి జట్టుకు విజయం అందించడంతో మన 'దాదా' టిషర్టు విప్పి తన విజయ దర్పాన్ని చాటాడు.

 1983 తర్వాత 'దాదా' నేతృత్వంలో 2003లో భారత జట్టు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఆ వరల్డ్‌ కప్‌లో గంగూలి 3 సెంచరీలు సాధించడంతో పాటు.58.12 ఆవరేజ్‌తో 465 పరుగులు సాధించి ఫైన్‌లోకు వెల్లడంలో కెప్టెన్‌గా ఆటగాడిగా తన సత్తా చాటుకున్నాడు.
2004 దాదా ప్రతిభకు నిదర్శనంగా భారత త్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అందించడం జరిగింది.

 తగాదాలు - వివాదాలు... రీఛార్జీంగ్‌...!
అప్పటి కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌తో జరిగిన వివాదం అంతా ఇంతా కాదు ఇద్దరు మీడియాకెక్కి ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. గంగూలి తన నియంతృత్వదోరణిద్వారా జట్టును బ్రష్టుపట్టిస్తున్నాడని చాపెల్‌ భారత క్రికెట్‌ బోర్డుకు లేఖ రాయడం జరిగింది. భారత కెప్టెన్లలో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ గా కీర్తి గడించిన గంగూలి తదుపరికాలంలో గాయాలబారినపడి, వివాదాలలో తలమునకలవుతూ కెప్టెన్సీకి రాజీనామా చేసాడు.

ఈ పరిణామాల దృష్ట్యా2005అక్టోబర్ నుండి జట్టుకు  దూరమవడం జరిగింది.
                                    పునరాగమనం 
ఐసిసి ఛాంపియన్‌ ట్రోపీలో, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమై 4-0 తో సిరీస్‌ కోల్పోవడంతో..కైఫ్‌, రైనా మిడిలార్డర్లో విఫలమవ్వడంతో గంగూలి సేవలు జట్టుకు అత్యవసరమైన దృష్ట్యా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు మళ్లీ జట్టులోకి పిలుపు లభించింది. ఆ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రాణించి 81 పరుగులచేయడంతో ఆమ్యాచ్‌ గెలవడం జరింగింది. అయినప్పటికీ మిగతా మాచ్ లు ఓడిపోవడం తో ఆ సిరీస్‌కోల్పోయాము. గంగూలి ఆ సిరీస్‌లో  రాణించి అందరికంటే ఎక్కువ సాధించాడు.
తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపికయ్యి రెండు సంవత్సరాల తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 98 పరుగులు సాధించి తనా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత జరగిన శ్రీలంక సిరీస్‌లో భాగా రాణించి 70 సగటుతో సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించి మ్యాన్‌ఆఫ్‌ ద సిరీస్‌ కైవసం చేసుకున్నాడు.
తర్వాత జరిగిన 2007 వరల్డ్‌ కప్‌కె ఎంపికయ్యాడు కానీ అప్పట్లో చాపెల్‌ అనవసర ప్రయోగాలు మరియు టీం వర్క్‌ లోపంతో ఇండియా మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.
ఆ ఓటమి తర్వాత సచిన్‌ బాధాకరమైన హృదయంతో మాట్లాడుతూ 'చాపెల్‌ మా వ్యక్తిత్వాలను ప్రశ్నించాడు' అని చెప్పాడు. ఇది జట్టు సభ్యులతో చాపెల్ ప్రవర్తనకు దృష్ట్యాంతము. ఆ తర్వాతా చాపెల్‌ తన ఒప్పందం ముగియగానే మళ్లీ కొనసాగకుండా కుటుంబంతో గడుపాలనే నెపంతో తన పదవికి రాజీనామా చేసి వెళ్లాడు.

2007 పాకిస్తాన్‌తో జరిగిన ముడో టెస్టులో 239 పరుగులు సాధించడం ద్వారా గంగూలి తన టెస్టు కెరీర్‌లో మొదటి డబుల్‌ సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్‌లో యువీ కలిసి 300 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
2007 సంత్సరంలో వన్డే, టెస్టు ఫార్మాట్లలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. టెస్టుల్లో 61.44 సగటుతో 1106 పరుగులు, వన్డేల్లో 44.28 సగటుతో 1240 పరుగులు సాధించాడు. ఆ సంవత్సరం టెస్టుల్లో రెండో అత్యుత్తమ స్కోరర్‌గా ( మొదట కల్లిస్‌‌), వన్డేల్లో ఐదవ ఉత్తమ స్కోరర్‌గా నిలిచాడు.
2008లో ఆస్ట్రేలియాతోజరగిన నాలుగు టెస్టుల బోర్డర్‌ - గవాస్కర్‌ సిరీస్‌ తర్వాత రిటైర్‌ అవుతానని ముందే ప్రకటించాడు. ఆ సిరీస్‌లో రాణించి 54 సగటుతో 324 పరుగులు సాధించాడు. మొహలీలో జరగిన రెండవ టెస్టులో తన చివరి టెస్టు సెంచరీని చేసాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఒకవికెట్‌ తేడాతో టెస్టు గెలిచింది. ఆ సిరీస్‌ 2- 0 తో గెలుచుకున్న  దోని ఆధ్వర్యంలోని  భారత జట్టు ఈ విజయాన్ని గంగూలికి అంకితమిచ్చింది.
                                        ఐపిఎల్‌

 
2008 లో ఐపిఎల్‌లో  బాలివుడ్‌ బాద్‌షా జట్టుఅయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌జట్టుకు గంగూలి కెప్టెన్‌గా నియమితుడైనాడు. ఐపిఎల్‌ మొదటి సీజన్‌ల్లో 14 మ్యాచ్‌ల్లో 6 గెలుపొంది 7 మ్యాచ్‌లో ఓడిపోయింది , ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. దాంతో ఆరవ స్థానంలో నిలిచింది.
షారుక్‌తో వచ్చిన స్పర్థల దృష్ట్యా ఐపిఎల్‌ రెండవ సీజన్‌2009లో నైట్‌రైడర్స్‌జట్టుకు కెప్టెన్‌గా మెక్‌కల్లమ్‌ను నియమించడం జరిగింది. ఆ సీజన్‌లో నైట్‌రైడర్స్‌ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొంది పాయింట్లపట్టికలో అట్టడుగు స్థానంలోకి చేరుకుంది. గంగూలిని కెప్టెన్సీ నుంచి తప్పించడం ద్వారానే ఆ జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందని మీడియా బహిరంగంగా విమర్శించింది.
                                        పదవులు:
2008 జూలై 7 వతేదీన తన గురువుగా ఉండి తర్వాత మనస్పర్థలతో విడిపోయిన  దాల్మియాకు ఎదురుగా పోటీ చేసి బెంగాల్‌ క్రికెట్‌ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
ఎన్నో విజయాలు.... ఎన్నో ప్రశంసలు... ఆ తర్వాత ఎన్నెన్నో అభాండాల ఆటుపోట్ల బండారళ్లపై ఎదురీగుతూ వచ్చి తన అప్రహతీతమైన కెరీర్‌ను సాగించాడు.
                                                     ప్రస్తుతం 

 భారత జట్టుకోసం అహర్నిషలు శ్రమించి ఎంతో గడ్డు పరిస్థితులలో ఉన్న జట్టును ఉన్నత స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన గంగూలి సేవలను మర్చిపోయి నేడు ఐపిఎల్‌ - 4  కోసం జరుగుతున్న బిడ్డింగ్‌లో కనీసం తన పేరును ప్రస్థావించకపోవడం బాధాకరం. ఇది క్రికెట్‌ అంటే తెలియని వారు డబ్బు చేతిలో ఉందనే అహంతో తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ... ఉన్నత మైన వ్యక్తులకు బహిరంగంగా అవమాన పరచడమే. అంతా అయిపోయిన తర్వాత గంగూలిని నేను మర్చిపోనని అతడు అద్భుత ఆటగాడంటూనే అతన్ని జట్టులోకి తీసుకోకపోవడం షారుక్ ఖాన్ కే  చెల్లింది.  ఇది గంగూలికి  జరిగిన అవమానం కాదు యావత్ క్రికెట్‌ ప్రపంచానికి జరిగిన అవమానం.

సుందర్

No comments:

Post a Comment