అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, January 26, 2011

అరుదైన గౌరవం

మా ఊరు ధర్మన్నగూడ ఆంధ్రప్రదేశ్‌ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక చిన్న గూడెం. మా ఊర్లో సుమారు 250 ఇండ్లు ఉంటాయి. 1000 మంది జనాభా ఉంటుంది. అందులో ఒక చిన్న స్కూల్‌ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మా పాఠశాల ప్రధానోపాద్యాయులుగారు శ్రీ రాజమోహన్‌ రెడ్డి సార్‌ గారికి చాలా అరుదైన గౌరవం లభించింది. 62 గణతంత్య్ర సంబరాల సందర్భంగా ఆదర్శయూత్‌ ఆద్వర్యంలోఆ సార్ గారిని  ఘనంగా సత్కరించడం జరిగింది. విశేషం ఏమిటంటే ఆయన మా ఊరికి విచ్చేసి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన కృషికి, ఆయన అంకిత భావానికి ఆయన విద్యార్థుల పట్లతీసుకునే చొరవకుగానూ ఆయనను సంత్కరించాము. ఆయన మా ఊరికు 2000 సంవత్సరంలో వచ్చారు అప్పటికే కొట్లాటలతో గ్రూపు రాజకీయాలతో సతమతమౌతున్న మా ఊరులో విద్య ప్రాధ్యాన్యతను తెలియజేసి. ప్రతి ఒక్క పిల్లవాడి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని మా పాఠశాలను ఒక మోడల్‌ స్కూల్‌గా తయారు చేసిన ఆయనకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే. సాధారణంగా ఒక స్కూల్‌కి ఒక త్రిఫుల్‌ఐటి సీటు రావడం గగణం. ట్రిఫుల్‌ఐటి సెలక్షన్స్‌లో కొన్ని మండలాలకు ఒక్క సీటు కూడా దక్కని పరిస్థితి. అదే మా స్కూల్‌నుండి వరుసగా మూడు సంవత్సరాలు ముగ్గురు విద్యార్థులు ట్రిఫుల్‌ఐటికి ఎన్నికవ్వడం అంటే అందులో ఆయన పాత్ర, కృషి ఎంతో ఉంది. అందుకే యాచారం సిఐ,చుట్టుపక్కల గ్రామాల ఎచ్‌ఎమ్‌లు, మరియు ఉపాధ్యాయులు, యువజనసంఘాల కన్వినర్లను ఆహ్వానించి. వారి సమక్ష్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. మా రాజమోహన్‌ సారుగార్కి ఆయన మాకు చేసిన దానితో పోలిస్తే మేము  ఎంత చేసినా తక్కువే ఆయనకు మేము ( మా గ్రామ ప్రజలం) ఎప్పటికీ ఋణపడి ఉంటాము.


సుందర్

No comments:

Post a Comment