అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, January 25, 2011

ఇన్నేళ్ళ స్వాతంత్ర్య భారతాన్ని ఆ నా "కొడుకులే" పరిపాలించాలా?

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 60 ఏళ్ళు దాటింది. గణతంత్రరాజ్యం ప్రకటించుకుని మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. మనది సాధా సీదా రాజ్యాంగం కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల రాజ్యాంగాలను శోధించి మరెన్నో విలువలు, సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన అత్యున్నతమైన రాజ్యాంగం ఏమిచెబుతోంది? నేడు ఏం జరుగుతోంది.......?
ఇది పేరుకు ప్రజాస్వామ్య రాజ్యం కానీ ఇక్కడ నడుస్తున్న పాలన రాజరిక పాలన నెహ్రూ  పోతే.. ఇందిరా.. ఇందిరా పోతే... రాజీవ్‌... రాజీవ్‌... పోతే..... రాహుల్‌.. అంటే  నూటపది కోట్ల జనాభా ఉన్న భారత దేశాన్ని ఒకే ఒక కుటుంబం మాత్రమే పరిపాలించాలా..... వారి చెప్పుచేతుల్లోనే దేశ రాజకీయాలు నడవాలా.....?


ఇలాంటి రాజరికాన్ని పరోక్ష్యంగా అనుభవిస్తున్న కుటుంబాలు ప్రతీ రాష్ట్రానికి ప్రతీ జిల్లాకి.. ప్రతీ నియోజక వర్గానికి.. ప్రతి మండలానికి... చివరికి ప్రతీ గ్రామంలో  ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రాన్ని తీసుకుందాం... వైఎస్‌రాజశేకరరెడ్డి కుమారుడంటా...మళ్లీ అతనే సిఎం కావాలంటా... ఎందుకు...? ఎందుకు అతనే సిఎం కావాలి...? రాష్ట్రాన్ని పరిపాలించే సత్తువ ఉన్న నాయకులే కరువయ్యారా...? ఇప్పుడే మన చంద్రబాబు గారు అతని వారసున్ని మెళ్లి మెళ్లిగా రాజకీయాల్లోకి దింపుతున్నాడు..? నిన్న మొన్నటిదాకా విదేశాల్లో చదివి కష్ట నష్టాలంటే ఏమిటోతెలియకుండా పెరిగిన వాడు రేపు.... తెలుగు దేశానికి వారసుడు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక తెలంగాణా ముద్దు బిడ్డను నేనే తెలంగాణా తెస్తా... అని గత పది సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ వస్తున్న కెసిఆర్‌గారి వారసున్ని కూడా భరిలోకి దింపి చాలా రోజులే అయ్యింది. అంతేకాదు అతని కూతురు కూడా తెలంగాణా మహిళా విభాగాన్ని నడిపేస్తోంది ( ఆ పార్టీలో). అంటే వాళ్ల కొడుకులు వాళ్లవాళ్ల కొడుకులు..... వాళ్లవాళ్లకొడుకులే.. నా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని... పాలించేది. ఈ నా''కొడుకుల''కంటే కంటే ప్రతిభావంతులు పార్టీకోసం గుండెను కోసి ఇచ్చే త్యాగంతో కార్యకర్త స్థాయినుంచి నాయకుడిగా కష్టపడి ఎదిగిన అట్టడుగు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులకు ఎవ్వరికీ పాలించే అర్హత లేదా...?

ఇలాగే సాగుతూ పోతే.. మనం భారత దేశ చరిత్ర చెప్పుకోవాలంటే పలానా కుటుంబం పరిపాలించిన కాలంలో..... అంటూ చెప్పుకోవాల్సి వస్తుంది. భారత దేశం గణతంత్ర దేశం.. భారత దేశం ప్రజా స్వామ్య దేశం అందుకే దేశం కొన్నికుటుంబాల చేత పరిపాలించబడడం కరెక్టు కాదు..... ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగానై ఇలాంటి కుటుంబ రాజకీయాలను బహిష్కరిద్దాం... నిజమైన గనతంత్ర రాజ్యాన్ని నిర్మించుకుందాం.....
 
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


- సుందర్

1 comment:

  1. Very well said.

    If I have to say in your words "ఆ నా "కొడుకులే"" (most corrupt Congress politicians) rule India and can install any body on the power base. Example. that Italian.

    To morrow (in your words) "ఆ నా "కొడుకులే"" (most corrupt Congress politicians) can install some one from Pakistan or Bangladesh or China or England as PM and President. Who knows?

    Be vigilant. Protect Indian Democracy and Indian people.

    ReplyDelete