అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 24, 2011

అయ్యో.... మా ఆయన కొడ్తడు...

తెలంగాణాపై తుది నిర్ణయం వచ్చే వరకూ...పరీక్షలు రాయకూడదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇక మా ఎమ్‌కమ్‌ మొదటి సెమిస్టరు పరీక్షలు రాయొద్దని మా కాలేజీ విధ్యార్థులంతా నిర్ణయించారు. మొదటిరోజు మా కాలేజీ నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసారు. మనల్ని కాదని వాళ్ళెలా  రాస్తారు రా వాళ్ళు బయటికి రాని చెబుదాం అని ఒకడు. వారితో అసలు మాట్లాడొద్దు అని ఇంకొకడు,  ఇలా చాలా డైలాగులు ఫ్లోలో వచ్చాయ్.  ఇక రెండో పరీక్ష ఎకానమిక్స్‌ రోజు కూడా  రాయకూడదని  సెంటర్‌ వద్ద నిల్చున్నాము. అప్పుడే ఒక అమ్మాయి నేను పరీక్ష రాస్తానని గబగబా వెళ్తోంది . ఏంటీ ఈ అమ్మాయి మొదటి పరీక్ష రాయలేదు కదా ఇప్పుడు ఎందుకు వెళ్తోందని అందరిలో ఒకటే చర్చ తీరా ఆరా తీస్తే పరీక్ష రాయక పోతే ''మా ఆయన ఊరుకోడు'' మొదటి పరీక్ష రాయలేనందుకే చాలా తిట్టాడు. అని ఆ అమ్మాయి చెప్పడంతో మేమంతా షాక్‌ అప్పటి వరకు ఆమెకు పెళ్ల్లి అయ్యిందని నాతో పాటు చాలా మందికి తెలియదు. ఆ డైలాగ్‌ పూర్తవగానే చాలా మంది నవ్వుకున్నారు. కానీ ఏ ఒక్కరూ మళ్లీ వద్దని చెప్పలేదు ఎందుకంటే ఆ డైలాగ్‌లో అంత ఫవర్‌ ఉంది మరీ.......
సుందర్

No comments:

Post a Comment